మొదలైన గత పాలకుల అక్రమాల తవ్వకాలు...!

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం కొంతమంది జర్నలిస్టులు 59 వ జీఓను అడ్డంపెట్టుకొని సుమారు రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అప్పటి స్థానిక ఎమ్మేల్యే అండదండలతో అక్రమ మార్గంలో కాజేశారనే వార్తలు మీడియా,సోషల్ మీడియాలో విస్తృతంగా హల్చల్ చేసిన విషయం తెలిసిందే.బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం,అప్పటి స్థానిక ఎమ్మేల్యే అక్రమార్కులకు అండగా ఉండడంతో ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించారు.దానికి కారణం ఎమ్మెల్యే ద్వారా అధికారులపై ఒత్తిడి జరిగిందని ప్రచారం జరిగింది.

 Will Congress Govt Take Action On Illegal Govt Land Acquisitions, Congress Govt-TeluguStop.com

59 జీవోను అడ్డం పెట్టుకుని అక్రమంగా ప్రభుత్వ భూమి కాజేసిన కొందరు జర్నలిస్టులకు మొన్నటి దాకా అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే అండగా ఉండడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చనే స్వార్దంతోనే మాజీ ఎమ్మెల్యే జర్నలిస్టుల కోరికను కాదనలేకపోయారని టాక్.

సుమారు 10 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని జర్నలిస్టులు స్వాహా చేయడంపై అప్పట్లో పలువురు బాధితులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతల ఒత్తిడితో అధికారులు చర్యలకు వెనకాడినట్లు సమాచారం.

ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మరోసారి ఆ భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఈ భూ అక్రమాలకు పాల్పడిన వారిలో బీఆర్ఎస్ ఇంటి మీడియా నమస్తే తెలంగాణ నల్గొండ జిల్లా బ్యూరో,టీన్యూస్ ఉమ్మడి నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్,టివి9 ఉమ్మడి నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్,ఆంధ్రజ్యోతి నల్గొండ జిల్లా బ్యూరో,ఓ ప్రధాన పత్రిక బినామి, వెలుగు బ్యూరో,ఆర్ టివి నల్గొండ స్టాఫ్ రిపోర్టర్,ఓ యూ ట్యూబ్ చానెల్ ప్రతినిధి ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం.కాంగ్రెస్ ప్రభుత్వమైనా అక్రమార్కులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమి కాపాడాలని పలువురు జర్నలిస్టులు,ప్రజా సంఘాల విజ్ఞప్తి చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube