మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించునన్నారు.ఈ మేరకు తిరుపతి జిల్లాకు ఆయన బయలుదేరారు.
వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామానికి సీఎం జగన్ వెళ్లనున్నారు.స్వర్ణముఖి నది కట్ట తెగి పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు.
తరువాత గ్రామస్తులు, బాధితులతో నేరుగా సమావేశం కానున్నారు.వారితో మాట్లాడనున్న సీఎం జగన్ బాధితులకు భరోసా ఇవ్వనున్నారు.
అక్కడి నుంచి బాపట్ల జిల్లాకు వెళ్లనున్నారు.పలు మండలాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు.
అయితే ఇటీవల బీభత్సం సృష్టించిన మిగ్జామ్ తుపానుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడంతో పాటు పంట పొలాలను నష్టపోయారు.