ఆత్రేయ( atreya ) … ఈ పేరు చెప్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన రచయితగా అందరికీ పరిచయమే.కానీ సినిమా చూసేవారికైతే ఆత్రేయ పలుకులు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి కానీ సినిమా తీసే వారికి ఆయనను పెట్టుకుంటే నరకం కనిపిస్తుంది అని ఆయన మీద వచ్చినన్ని చలోక్తులు మరెవరి మీద వచ్చి ఉండవు.
అంతలా దర్శకులను, నిర్మాతలను తిప్పి తిప్పి చంపేస్తారు ఆత్రేయ.అందుకోసం కొన్ని ఉదాహరణలు కూడా చూద్దాం.

సాక్షి సినిమాలో క్లైమాక్స్ లో ఒక పాట రాయించుకోవడం కోసం బాపు రమణలు( Bapu Ramana ) ఆత్రేయను కలిసి అడ్వాన్స్ గా కొంత డబ్బులు ఇచ్చి పాట రాయమని చెప్పారట.దానికోసం సినిమా ఎన్ని రోజులు తీశారో అన్ని రోజుల పాటు కూడా ఆయన చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి చివరకు ఆరుద్రను పెట్టుకొని ఆ పాట రాయించుకుని సినిమా విడుదల చేశారట.ఆ తర్వాత ఎక్కడో కనిపించి ఏమయ్యా బాపు మళ్లీ కనిపించలేదు ఏమిటి డబ్బులు ఇచ్చి వెళ్ళాక అని అడిగితే మీ పుణ్యాన మళ్లి కలిసి పనిచేసే అదృష్టం లేదండి.మాకు ఇంకా ఆరుద్ర దొరికాడు అని చెప్పారట.
మరి నాకు ఇచ్చిన డబ్బులు ఏం చేయమంటావు తిరిగిచ్చేదా అని అడిగితే, ఆ విషయం మర్చిపోండి సార్ అంటూ చెప్పి అక్కడి నుంచి పలాయనం చిత్తగించారట.

అలా ఏ దర్శకుడైన నిర్మాత అయిన ఆయన చుట్టూ తిరగాల్సిందే.కానీ ఆయన మాత్రం పాట పూర్తి చేయడానికి ఎన్ని నెలలు తీసుకుంటారో తెలిసేది కాదు.ఒకసారి ఒక దర్శకుడు చోళోనా( Cholona ) అనే హోటల్లో రూమేసి మరి ఒక పాట రాయమంటే ఎంత బిల్ అయినా సరే కానీ పాట మాత్రం పూర్తవడం లేదు.
దాంతో నిర్మాతకి ముక్కు మీదికి కోపం వచ్చేసి వెళ్లి అడిగితే నువ్వు చోళోనా హోటల్లో రూమ్ వేసావు అందుకే పాట రాయలేకపోతున్నాను.అక్షరం కూడా పేపర్ పై దిగాను అంటుంది.
మనం పల్లవులం కాబట్టి ఈ హోటల్ అచ్చిరాదు అని సమాధానం చెప్పి వెళ్లిపోయారట.అలా ఉంటుంది ఆత్రేయ గారి పద్ధతి.