కలకత్తా మహిళా డాక్టర్ ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడాలి

నల్లగొండ జిల్లా:కోల్ కతా కె.జి.

 The Government Should Stop Its Negligence On The Calcutta Woman Doctor Incident-TeluguStop.com

కార్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి,హత్య చేసి 27 రోజులు గడిచినా ఆ దోషులను శిక్షించకుండా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వేడుక చూస్తుందని,ఎవర్ని రక్షించడానికి ఈ కాలయాపనని ఇఫ్టూ నల్లగొండ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ ప్రశ్నించారు.గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో మౌమిత అత్యాచార నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇప్టూ అధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించి, ట్రైనీ డాక్టర్ మౌమితకు నివాలులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని నుండి మారుమూల గ్రామం వరకు స్త్రీకి ఎక్కడా రక్షణ లేదని,నాగరిక సమాజంగా చెప్పుకుంటూ,ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళు సాటి డాక్టర్ పై ఇంత ఘోరానికి ఒడిగట్టడం ఆటవిక చర్యని,ఆమెపై 15 మంది అత్యాచారం చేసి చంపేస్తే ఎవరో ఒకర్ని దోషిగా చూపి,దానిలో ఉన్న అసలు నిందితులను తప్పించే ప్రయత్నం మమత ప్రభుత్వం చేస్తుందని,ఇది సాధారణ అత్యాచార ఘటన కాదని,మెడికల్ కాలేజీలో జరుగుతున్న అవకతవకలు,కాలేజీలో డ్రగ్స్ సరఫరా, అవయవాల అక్రమ వ్యాపారాలు మొదలగు వాటిని ప్రశ్నించినందుకే ఆ అమ్మాయిని చంపేశారని, ఇదంతా కాలేజీ ప్రిన్సిపాల్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు.అదేవిధంగా అంతకు ముందే ప్రిన్సిపల్ పై ఎన్నిసార్లు కంప్లైంట్స్ ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం,ఈ హత్య జరిగిన తరువాత అతన్ని ఈ కాలేజి నుండి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి,దీనికన్నా పెద్ద కాలేజీకి ప్రిన్సిపాల్ గా నియమించడం అంటే ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఖచ్చితంగా ఉందని, ఇప్పటికైనా సాటి మహిళగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రిన్సిపాల్ ని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చి,మౌమిత దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని,దేశ వ్యాప్తంగా అన్ని హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేసే మహిళా వైద్యులకు రక్షణగా పోలీస్ పాట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు రావుల వీరేశ్,దాసరి నర్సింహ, చింతల వెంకటరమణ, బొమ్మపాల అశోక్, పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి పోలె పవన్, కత్తుల శంకర్,ప్రవీణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube