ప్రజలను బెదిరిస్తే ఖబడ్దార్:ఆర్ఎస్పీ

నల్లగొండ జిల్లా:ఉప ఎన్నికల్లో తమ పార్టీకి ఓటేయకపోతే పథకాలు,ఫించన్లు రావంటూ టిఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని డా.ఆర్.

 Khabaddar If People Are Threatened: Rsp-TeluguStop.com

ఎస్.ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.గురువారం సాయంత్రం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిగూడ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచారానికి వెళ్లిన గులాబీ నాయకులు ప్రజలతో మీ ఫోన్ నంబర్లు మా దగ్గర ఉన్నాయని,టిఆర్ఎస్ కు ఓటేయకపోతే వెంటనే తెలిసిపోతుందని,వేయకపోతే ఫించన్లు రావని,ఏ పథకాలకు అర్హులు కారని బెదిరిస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికే నియోజకవర్గంలో హరీష్ రావు,కేటీఆర్ వందల కోట్లు తీసుకొచ్చి పంచడానికి సిద్ధంగా ఉన్నారని,అయినా సరే గెలవమని తెలియడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.

కేసీఆర్ వచ్చి కుర్చీ వేసుకుని కూర్చొని మాట్లాడినా సరే ప్రజలు టీఆర్ఎస్ కు ఓటేయరని తేల్చిచెప్పారు.మరోపక్క ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రైవేట్ సైన్యం,గుండాలతో దాడి చేస్తామని బెదిరిస్తున్నారని,ప్రజలను బెదిరిస్తే ఊరుకోమని ఖబడ్దార్ రాజగోపాల్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖచ్చితంగా మునుగోడులో మీ పార్టీలకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.అధికార,ధన,మంద బలంతో ప్రజలను చిన్నచూపు చూస్తే ఊరుకోమన్నారు.దొరల పోకడలను ఓడిస్తామన్నారు.70 ఏళ్లుగా పేదల బతుకులు మార్చకపోగా,వారిని అవమానిస్తున్న దోపిడి దొంగల పార్టీలను గద్దె దించాలని నినదించారు.బహుజన్ సమాజ్ పార్టీని ఎదుర్కోలేకనే ఇది ఎస్సీల పార్టీ అని ముద్ర వేస్తున్నారని తెలిపారు.ఎస్సీల పార్టీ అయితే మునుగోడులో బీసీ అభ్యర్థికి టికెట్ ఎలా ఇచ్చామని ప్రశ్నించారు.

రాబోయే ఎన్నికల్లో కూడా బీసీలకు 60 నుండి 70 సీట్లు ఇస్తామని ప్రకటించిన పార్టీని ఎస్సీల పార్టీ అని కావాలని కుట్రపూరితంగా ఆధిపత్య వర్గాలు ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.మునుగోడులో ఎంత డబ్బు,మద్యం,బిర్యాని పంచి ప్రలోభపెట్టినా బహుజనులంతా ఒక్కటై ఏనుగు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్,రేవంత్ రెడ్డి,బండి సంజయ్,ఇతర కమేడియన్లు ఎంత మంది వచ్చినా ఏనుగు గుర్తునే గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విజయ్ ఆర్య,జిల్లా నాయకులు పల్లేటి రవీందర్,లింగం, సిద్దార్థఫూలే తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube