జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ కు టిడబ్ల్యూజేఎఫ్ వినతి

నల్లగొండ జిల్లా:అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండస్థలాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

 Twjf Requested The Collector To Give Houses To The Journalists, Twjf , Journali-TeluguStop.com

ప్రజా సేవలో నిమగ్నమైన జర్నలిస్టులు అద్దె ఇల్లల్లో నివసిస్తూ,అద్దెలు కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అనేకమార్లు విన్నవించామన్నారు.

అయినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదని అవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిందని, అందులో భాగంగా మిర్యాలగూడలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు కేటాయించేవిధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ కోరినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు ఖాజా హామిదోద్దీన్,జిల్లా అధ్యక్షులు ఆయూబ్, రాష్ట్ర కమిటి సభ్యులు జి.వెంకన్న,మనోజ్,మహేష్, నియోజకవర్గ అధ్యక్షకార్యదర్శులు మంద సైదులు, జయరాజు,నామిరెడ్డి నరేందర్ రెడ్డి,ఖాజా నాజిమోద్దీన్,రామకృష్ణ, నాగరాజు,అరుణ్,రమేష్, సతీష్,నాగేందర్,బాబు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube