పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నిన్న పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పవన్ నటిస్తున్న సినిమాల నుండి బర్త్ డే ట్రీట్స్ వచ్చాయి.
ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ‘ఓజి’ ఒకటి.ఈ సినిమా నుండి అన్నిటి కంటే అదిరిపోయే ట్రీట్ వచ్చింది.
ఈ ట్రీట్ అందరిని మెప్పించింది.అన్నిటికంటే ఓజి టీజర్( OG Movie Teaser ) నే ఫ్యాన్స్ కు నెక్స్ట్ లెవల్ ట్రీట్ ఇచ్చింది.

ముంబై గ్యాంగ్ స్టర్ గా పవన్ లుక్, స్టైల్( Pawan OG Look ) అంతా కూడా ఆకట్టుకోగా ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి.ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పవన్ బర్త్ డే( Pawan Kalyan Birthday ) కానుకగా వచ్చిన ఈ టీజర్ కు మాసివ్ రెస్పాన్స్ రావడమే కాదు ఇందులోని బీజీఎమ్ నెక్స్ట్ లెవల్లో ఆకట్టుకుంది.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్( Music Director Thaman ) ఇచ్చిన ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోగా సోనీ మ్యూజిక్ వారిని ఈ స్పెషల్ ట్రాక్ కావాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ డిమాండ్ చేయడంతో దీనిపై మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

ఈ రోజు మ్యూజిక్( OG Movie Music ) బ్లాస్ట్ ను అందిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.ఈ ట్రాక్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుండగా గుడ్ న్యూస్ చెప్పడంతో ఇప్పుడు సంతోషంగా ఉన్నారు.ఈ ట్రాక్ ఫ్యాన్స్ కోసం మ్యూజిక్ లవర్స్ కోసం అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ తోనే ఈ సినిమా మామూలుగా ఉండదని సుజీత్ చెప్పకనే చెప్పాడు.దీంతో సుజీత్ మీద కూడా ఫ్యాన్స్ లో నమ్మకం ఏర్పడగా మూవీ ఫైనల్ గా ఎలా ఉంటుందో చూడాలి.







