సీబీఐ కొత్త చీఫ్ డైరెక్టర్ గా మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురి ప్రధాని మోడీ లతో కూడిన త్రిసభ్య కమిటీ 109 మందిని వడపోసి జైశ్వాల్‌ను సెలెక్ట్ చేయడం జరిగింది.
మొదటి నుండి సీబీఐ కొత్త డైరెక్టర్ పదవి ఎప్పుడైతే తెరపైకి వచ్చిన అప్పటి నుండి సుబోధ్ కుమార్ జైస్వాల్ పేరు మారుమ్రోగుతోంది.చాలామంది ఈ పదవి అధిరోహించాలని చూడగా చివరాకరికి సుబోధ్ కుమార్ కే వరించింది.
సుబోధ్ కుమార్ అత్యంత సీనియర్ కావటంతో మహామహులు పోటి వచ్చిన ఏం చేయలేకపోయారు.
గతంలో సీబీఐ డైరెక్టర్ గా వున్న రిషికుమార్ శుక్లా ఫిబ్రవరిలో రిటైర్ అవ్వడం జరిగింది.
ఆ సమయం నుండి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఎటువంటి డైరెక్టర్ లేకుండానే తన విధులు నిర్వహిస్తూ ఉంది.దీంతో తాజాగా సీబీఐ కొత్త చీఫ్ ఆఫీసర్ పదవి సుబోధ్ కుమార్ అధిరోహించడం తో రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
సుబోధ్ కుమార్ 1985 మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి, అదే రీతిలో ఆ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు కూడా నిర్వహించారు ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ డీజీ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను గత ఏడాది డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసులకు రావటం జరిగింది.ఈ నేపథ్యంలో తాజాగా సీనయారిటీ ఎక్కువగా ఉండటంతో సుబోధ్ కుమార్ ని త్రిసభ్య కమిటీ సీబీఐ కొత్త డైరెక్టర్ గా ఎంపిక చేసింది.