జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు క్లారిటీ వచ్చేసింది.ఈ నియోజకవర్గంలో 91 వేల మంది కాపు ఓటర్లు ఉండటంతో పవన్ కళ్యాణ్ గెలుపు సునాయాసమేనని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు.ఈరోజు కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ 150 మందితో జనసేన పార్టీ( Janasena Party )ని మొదలుపెట్టామని ఈరోజు 6.5 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారని వెల్లడించారు.ఒక ఆశయం కోసం వచ్చినవాడినని నేను ఓడిపోతే శూన్యమనిపిస్తుందని ఆయన తెలిపారు.నేను బద్దకస్తుడిని కాదని చెప్పడానికే సినిమాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

నేను సమాజం కోసం ఆలోచిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) నాకోసం ఆలోచించారని ఆయన కామెంట్లు చేశారు.నేను రాజకీయాల్లోకి రావడం త్రివిక్రమ్ శ్రీనివాస్ కు నచ్చలేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.సినిమాల ద్వారా వచ్చే డబ్బును కౌలు రైతుల కోసం వినియోగిస్తున్నానని ఆయన వెల్లడించారు.నటుడిగా, ప్రజల అభిమానం ఉన్న వ్యక్తిగా నేను ప్రపంచమంతా తెలుసని ఆయన కామెంట్లు చేశారు.
జగన్( YS Jagan ) పై వ్యక్తిగతంగా ద్వేషం లేదని పవన్ తెలిపారు.బీజేపీ పొత్తుతో కొన్ని సీట్లు త్యాగం చేశానని పెద్ద మనస్సుతో వెళ్తే చిన్నవాళ్లం అయ్యామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
పార్టీ కోసం చాలామంది కష్టపడుతున్నారని కష్టపడుతున్న వారికి సీట్లు ఇవ్వలేకపోయానని ఆయన చెప్పుకొచ్చారు.

2024 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది.జనసేన పార్టీ 21 స్థానాల నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎన్ని స్థానాలలో విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది.జనసేన పార్టీ గెలుపు కోసం పవన్ పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ( TDP BJP ) సపోర్ట్ కూడా ఉండటంతో అనుకూల ఫలితాలు వస్తాయని అభిమానులు భావిస్తున్నారు.అయితే ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేసి ఉంటే బాగుండేదని విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.