ఏపీ ఎన్నికల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Junior NTR ) ఎవరివాడు అనే ప్రశ్నకు ఏ మాత్రం సందేహం అవసరం లేకుండా ఏ పార్టీకి చెందినవాడు కాదని సమాధానం చెప్పవచ్చు.ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తారక్ ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు.
రాజకీయపరమైన అంశాలలో జోక్యం చేసుకోవడానికి సైతం తారక్ ఏ మాత్రం ఇష్టపడటం లేదనే సంగతి తెలిసిందే.అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు( NTR Flexies ) మాత్రం ప్రచారంలో కనిపిస్తున్నాయి.
ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే మరో పార్టీకి తారక్ శత్రువు అయ్యే అవకాశాలు ఉంటాయి. పొలిటికల్ వివాదాలు( Political ) తన సినీ కెరీర్ పై ప్రభావం చూపడం తారక్ కు సైతం అస్సలు ఇష్టం లేదని సమాచారం అందుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో పూర్తిస్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేవరకు రాజకీయాలకు పూర్తిస్థాయిలో దూరమేనని సమాచారం అందుతోంది.
![Telugu Ap, Devara, Ntr, War, Young Tiger Ntr-Movie Telugu Ap, Devara, Ntr, War, Young Tiger Ntr-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Junior-NTR-Photos-Flexis-at-Kodali-Nani-Nomination-Rally.jpg)
పొలిటికల్ గా ఎలాంటి కామెంట్లు చేసినా సినీ కెరీర్ పై ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉండటంతో మౌనమే మంచిదని తారక్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా షూటింగ్ లతో బిజీ అవుతున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తన కెరీర్ పై ఏ మాత్రం ప్రభావం పడదని తారక్ ఫీలవుతున్నారని తెలుస్తోంది.
![Telugu Ap, Devara, Ntr, War, Young Tiger Ntr-Movie Telugu Ap, Devara, Ntr, War, Young Tiger Ntr-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/10/two-big-updates-from-ntr-upcoming-films-devara-and-war2a.jpg)
దేవర, వార్2 సినిమాలను ఏడాది గ్యాప్ లో విడుదల చేసేలా తారక్ కెరీర్ ప్లానింగ్ ఉందని సమాచారం అందుతోంది.ఏపీలో ఎన్నికల గెలుపును మేనిఫెస్టో( Manifesto ) డిసైడ్ చేయనుందని తెలుస్తోంది.టీడీపీ ఇప్పటికే హామీలను ప్రకటించగా వైసీపీ సైతం తుది మేనిఫెస్టోను మరికొన్ని గంటల్లో ప్రకటించనుందని తెలుస్తోంది.వైసీపీ గతంలో ప్రకటించిన హామీలను కొనసాగిస్తూనే మరికొన్ని కొత్త హామీల దిశగా అడుగులు వేస్తున్నట్టు భోగట్టా.