రియల్ మీ C65 స్మార్ట్ ఫోన్ లాంఛ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

రియల్ మీ C65 స్మార్ట్ ఫోన్( Realme C65 Smartphone ) భారత మార్కెట్లో రూ.10499 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.బడ్జెట్ ఫోన్ లో 5G సపోర్ట్ తో ఉండే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ వివరాల గురించి తెలుసుకుందాం.ఈ ఫోన్ 6.67 అంగుళాల HD+ డిస్ ప్లే తో 89.97 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 120 Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్, మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ తో వస్తుంది.ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.ఫోన్ వెనుక వైపు F/1.8 ఎపర్చర్ తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ సెకండరీ సెన్సార్ తో ఉంటుంది.

 రియల్ మీ C65 స్మార్ట్ ఫోన్ లాంఛ్-TeluguStop.com

వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 8ఎంపీ ఫ్రంట్ కెమెరా( Front Camera )తో ఉంటుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS తో రన్ అవుతుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 15w ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.కంపెనీ రిటైల్ బాక్స్ లో చార్జర్ ను కూడా అందిస్తుంది.ఈ ఫోన్ IP54 రేటింగ్ కలిగి ఉంది.ఈ ఫోన్ కు మూడేళ్ల ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లు( Android Security ), రెండేళ్ల OS అప్డేట్లు వస్తాయని కంపెనీ తెలిపింది.ఈ రియల్ మీ C65 ధర విషయానికి వస్తే.

ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

4GB RAM+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10499 గా ఉంది.4GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది.6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12499 గా( Realme C65 Storage ) ఉంది.ఈ ఫోన్ గ్లోయింగ్ బ్లాక్ కలర్, ఫెదర్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ realme అధికారిక వెబ్సైట్, ఫ్లిప్ కార్ట్, ప్రధాన స్టోర్లలో అందుబాటులో ఉంది.HDFC, Axis, SBI ఇతర కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube