టి20 చరిత్రలోనే అరుదైన రికార్డులు సృష్టించిన పంజాబ్..

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024( IPL 2024) సీజన్లో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్( Punjab Kings) కేకేఆర్ జట్టు పై సంచలన విజయం అందుకుంది.

అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కోల్కత్తా నైట్ రైడర్స్ విధించిన 261 పరుగుల భారీ స్కోరును మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించి రికార్డులను సృష్టించింది.

పంజాబ్ బ్యాటింగ్ లో బెయిర్ స్టో సెంచరీతో చెలరేగడంతో ఈ రికార్డును చేరుకోగలిగారు.బెయిర్ స్టో( Jonny Bairstow ) తోపాటు శశాంక్ సింగ్, ప్ర‌భ్‌సిమ్రాన్ ల వీరబాదుడుతో పంజాబ్ కు అద్భుత విజయాన్ని అందించారు.

భారీ లక్ష్య ఛేదనలో విజయం సాధించిన పంజాబ్ ఈ మ్యాచ్ ద్వారా అనేక అరుదైన రికార్డులను నెలకొల్పింది.ఇక వీటికి సంబంధించిన విశేషాలు చూస్తే.

కేవలం ఐపిఎల్ మాత్రమే కాకుండా ఏ టీ20 క్రికెట్ చరిత్రలో కూడా హైయెస్ట్ చేజింగ్ ఇదే.ఐపీఎల్ 2022 సీజన్లో పంజాబ్ కింగ్స్ పైనే రాజస్థాన్ 224 పరుగులు చేసి రికార్డును నెలకొల్పగా ఆ రికార్డును శుక్రవారం నాడు కోల్కత్తా పై పంజాబ్ రికార్డ్ బ్రేక్ చేసింది.ఇక 2023లో వెస్టిండీస్ పై 259 భారీ లక్ష్యాన్ని చేదించి సౌతఆఫ్రికా( South Africa ) రికార్డు నెలకొల్పగా ఆ రికార్డును పంజాబ్ బద్దలు కొట్టేసింది.

Advertisement

ఇకపోతే ఈ మ్యాచ్లో మరో రికార్డ్ ఏంటంటే మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు నమోదు కావడం ఇదే మొదటిసారి.రెండు టీంలు కలిపి 42 సిక్సర్లను కొట్టారు.ఈ సీజన్లోనే సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 38 సిక్సులు కొట్టారు.

ఆ రికార్డును ఈ మ్యాచ్ బ్రేక్ చేసింది.అంతేకాకుండా ఈ సీజన్లో సన్ రైజర్స్ జట్టు 2సార్లు ఒక ఇన్నింగ్స్ లో 22 సిక్సులు బాది రికార్డు సృష్టించగా.

తాజా మ్యాచ్లో పంజాబ్ 24 సిక్సర్లతో రికార్డును కొల్లగొట్టింది.రెండు టీమ్స్ కలిపి 500లకు పైగా పరుగులు చేయడం ఇది ఏడోసారి.

ఐపీఎల్ లో ఇది మూడోసారి.

చేపల వర్షం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు