తాగునీటి కోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) అన్నారు.ఈ మేరకు కృష్ణానది నుంచి నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు.
2.25 టీఎంసీల నీటి విడుదలకు కర్ణాటక ప్రభుత్వం ( Karnataka government)ఒప్పుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి నుంచి కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేస్తోందన్నారు.తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.తడిచిన ధాన్యం కూడా ఎంఎస్పీకి కొనుగోలు చేస్తామన్న ఆయన తరుగు ఎక్కువగా తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచామని, చివరి ధాన్యం గింజ వరకు అంతా కొంటామని తెలిపారు.