సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో డైరెక్టర్ సుకుమార్ ( Sukumar ) ఒకరు.ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలు డైరెక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే ఎప్పుడైతే పుష్ప ( Pushpa ) సినిమాకు దర్శకుడిగా మారారు ఈ సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరిపోయారు.
సుకుమార్ అల్లుఅర్జున్( Allu Arjun ) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి చిత్రం ఆర్య( Arya ) ఈ సినిమా విడుదల 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఈ తరుణంలోనే దిల్ రాజు( Dil raju ) ఘనంగా ఆర్య చిత్ర బృందానికి గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్య సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ గారు మాట్లాడుతూ దిల్ రాజుతో తనకు జరిగిన గొడవల గురించి తెలిపారు.ఆర్య సినిమా సమయంలో దిల్ రాజు గారితో నాకు చాలా గొడవలు జరిగేవనీ తెలిపారు.తరచూ అరుచుకోవడానికి పోట్లాడుకోవడం ఒకసారి ఇద్దరం గొడవపడి దాదాపు మూడు రోజుల పాటు మాట్లాడుకోలేదని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
అంతేకాకుండా ఆర్య సినిమా సమయంలో దిల్ రాజు నన్ను బాగా కొట్టేవాడు అంటూ సుకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిల్ రాజు గారు నేను ఏదైనా పనిలో ఉంటే వెనుక నుంచి వచ్చే తన చెయ్యిని వెనక్కి లాగి మడిచి మరి వీపుపై గట్టిగా కొట్టి వెళ్లిపోయేవారు.అలా ఆర్య సినిమా సమయంలో నన్ను బాగా కొట్టడం వల్ల ఇప్పటికి నాకు చెయ్యి పని చేయడం లేదని తెలిపారు.పుష్ అప్స్ చేయాలి అంటే చెయ్యి బాగా నొప్పి పుడుతుందని అలా నొప్పి పుట్టడానికి కారణం దిల్ రాజు కొట్టడమే అంటూ ఈయన తెలియజేశారు.
అయితే ఇదంతా కూడా సరదాగా అప్పుడు జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ సుకుమార్ చెప్పారు .కానీ దిల్ రాజు మాత్రం ఈవెంట్ లో కూడా సుకుమార్ గారిని అలాగే చెయ్యి వెనక్కి లాగి కొట్టడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు.ప్రస్తుతం సుకుమార్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.