ఏపీ సీఎం జగన్ రేపటి ప్రచార షెడ్యూల్ ఖరారైంది.ఈ మేరకు రేపు ఆయన మూడు నియోజకవర్గాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ముందుగా కర్నూలు నియోజకవర్గ (Kurnool Constituency)పరిధిలోని కర్నూలు వైఎస్ఆర్ సర్కిల్ కు సమీపంలో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ (CM JAGAN ) పాల్గొననున్నారు.మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం(Anantapur) జిల్లాలోని కల్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.అక్కడ సభ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట(Rajampet) పార్లమెంట్ పరిధిలోని కొడూరు రోడ్డులో నిర్వహించనున్న ప్రచార సభకు సీఎం జగన్(CM Jagan) హాజరుకానున్నారు.
కాగా సీఎం జగన్ పర్యటనకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్న సంగతి తెలిసిందే.







