అన్నమయ్య జిల్లా కలికిరిలో కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ( Narendra Modi) పాల్గొన్నారు.రాయలసీమలో ఖనిజ సంపదకు కొదవలేదని తెలిపారు.
రాయలసీమ( Rayalaseema)లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయన్న మోదీ సీమను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.రాయలసీమలో టూరిజానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.
ఈ క్రమంలో ఏపీ ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు తాను వచ్చానన్నారు.ఏపీ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు.
ఏపీకి రాయలసీమ అనేక మందిని సీఎంలను ఇచ్చిందన్న ఆయన ఎంతమంది వచ్చినా రాయలసీమలో మాత్రం అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు.పరిశ్రమలు లేవు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరగడం లేదని విమర్శించారు.
దేశ నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తున్నామన్న మోదీ ఎన్డీఏ వస్తే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు.ఈ క్రమంలో ఏపీలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని పిలుపునిచ్చారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని తెలిపారు.