యూఎస్ అధ్యక్ష ఎన్నికలు : ఇండియానా ప్రైమరీలో ట్రంప్ విజయం.. కానీ వార్నింగ్ బెల్ ఇచ్చిందిగా..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు.ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్‌గా అధికారికంగా నామినేషన్ పొందారు ట్రంప్( Trump).

 Us Presidential Election Unexpected Warning Signs For Donald Trump In Busy India-TeluguStop.com

ఓపీనియన్ పోల్స్‌ కూడా ట్రంప్‌కు పాజిటివ్‌గానే వస్తున్నాయి.కేసులు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటూనే ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఇక 2016లో ట్రంప్‌కు రిపబ్లికన్ నామినేషన్ దక్కడంలో కీలకపాత్ర పోషించిన ఇండియానా(Indiana) మరోసారి తన దమ్ము చూపించనుంది.

ఇక్కడ జరిగిన రిపబ్లికన్ ప్రైమరీలో (Republican primary) పోటీ లేకుండా ట్రంప్ గెలిచినప్పటికి.

జీవోపీకి కొన్ని హెచ్చరికలను పంపుతోంది.‘‘ AdImpact data ’’ ప్రకారం.

ఇండియానా రిపబ్లికన్ ప్రైమరీకి 98 మిలియన్ డాలర్ల ఖర్చు వచ్చింది.నెలల క్రితమే అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నప్పటికీ ట్రంప్ అనుకూల ప్రాంతాల్లో నిక్కీహేలీ బలమైన ముద్ర వేశారు.20 శాతానికి పైగా మద్ధతు ఆమెకు లభించింది.నిక్కీహేలీ వంటి ప్రత్యామ్నాయ స్వరాలు రిపబ్లికన్ పార్టీలో విస్తృత పునర్వ్యస్ధీకరణను సూచిస్తున్నాయి.

Telugu Donald Trump, Indiana Primary, Presidential-Telugu NRI

ఇప్పుడే కాదు.ఇండియానా రాష్ట్రం తీవ్రమైన కాంగ్రెస్ రేసులను చూసింది.అప్పట్లో ట్రంప్‌పై మైక్ పెన్స్‌ను ఆమోదించిన ప్రతినిధులు షాకిచ్చారు.అమెరికా లీడ్స్ యాక్షన్ కమిటీ వంటి సమూహాలు రిపబ్లికన్ ప్రయోజనాలకు అనుగుణంగా అభ్యర్ధులకు మద్ధతు ఇవ్వడంతో గణనీయంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

మునుపటి ఎన్నికలలో ట్రంప్‌కు కంచుకోటగా వున్న ఇండియానాలోని సబర్బన్ ప్రాంతాల్లో నిక్కీహేలీకి అనూహ్య మద్ధతును చూసింది.ఇది జీవోపీ ల్యాండ్‌స్కేప్‌లో మార్పును సూచిస్తుంది.ప్రైమరీలలో ఇండియానాది చివరిస్థానం అయినప్పటికి అధ్యక్ష అభ్యర్ధులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిందని గణాంకాలు చెబుతున్నాయి.2016లో ట్రంప్ విజయం సాధించడం ద్వారా .టెడ్ క్రూజ్, జాన్ కాసిచ్ వంటి బలమైన ప్రత్యర్ధులు రేసు నుంచి తప్పుకునేలా చేసింది.

Telugu Donald Trump, Indiana Primary, Presidential-Telugu NRI

ప్రెసిడెన్షియల్ రేసుకు మించి, సెనేట్, గవర్నర్, కాంగ్రెస్ సీట్ల కోసం ఇండియానా ఓపెన్ రిపబ్లికన్ ప్రైమరీలు పలు జీవోపీ వర్గాలకు యుద్ధభూమిగా మారాయి.సెనేటర్ మైక్ బ్రాన్ .గవర్నర్ రేసులో విజయం సాధించగా ప్రతినిధి విక్టోరియా స్పార్ట్జ్ కఠినమైన ప్రైమరీ సవాలు నుంచి తృటిలో తప్పించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube