కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తనను 2018లో భారత్‌లోని పంజాబ్ పర్యటన సందర్భంగా సిక్కు కార్యకర్తలను కలవమని బలవంతం చేశారంటూ ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది.దీనిపై కెనడా మాజీ రక్షణ మంత్రి, ప్రస్తుత ఎమర్జెన్సీ వ్యవహారాల శాఖ మంత్రి హర్జిత్ సింగ్ సజ్జన్ స్పందించారు.
ఈ నివేదిక ఖచ్చితమైనది కాదని .తాను, తన కుటుంబం సహా ఈ దేశంలోని వ్యక్తులపై భారత్ వద్ద తప్పుడు సమాచారం వుందని మండిపడ్డారు.కెనడాలోని సీపీఏసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కెనడియన్ వార్తాపత్రిక ది గ్లోబ్ అండ్ మెయిల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.‘‘ 2018లో ప్రధాని జస్టిన్ ట్రూడో ( Justin Trudeau )పంజాబ్‌లో పర్యటించారు.ఆ సమయంలో ట్రూడో, అతని రక్షణ మంత్రి సంయుక్తంగా ఒక ప్రభుత్వాధికారిని కలవడానికి అంగీకరించకపోతే వారి విమానాన్ని పంజాబ్‌లో ల్యాండ్ చేయడానికి భారత్ నిరాకరించింది .నాటి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ .ట్రూడో, హర్జిత్ సింగ్ సజ్జన్‌కు పది మంది సిక్కు కార్యకర్తల పేర్లతో కూడిన పత్రాన్ని అందజేశారు.వీరి కార్యకలాపాలను నియంత్రించాలని భారత ప్రభుత్వం కోరుతోంది ’’ అని నివేదిక పేర్కొంది.

కెనడా చుట్టుపక్కల వున్న తమ స్వతంత్ర పోలీస్ బలగాలు, గూఢచార సేవలపైనా కెనడియన్లు విశ్వాసం కలిగి వుండటం చాలా ముఖ్యమన్న డిప్యూటీ ప్రధాని వ్యాఖ్యలపై తాను కూడా ఏకీభవిస్తున్నట్లు సజ్జన్ చెప్పారు.కెనడియన్లు తమ అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తీకరించే హక్కును కలిగి వున్నారని నొక్కి చెప్పారు.మన పోలీస్ బలగాలు స్వతంత్రంగా వున్నాయని.
మాజీ పోలీస్ అధికారిగా తాను ఈ విషయాన్ని ఖచ్చితంగా ధృవీకరించానని సజ్జన్ వెల్లడించారు.

కాగా.ఖలిస్తాన్ ( Khalistan )వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య కేసుతో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపిస్తూ ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.వీరిని వీడియో లింక్ ద్వారా తొలిసారిగా కోర్టు ఎదుట హాజరుపరిచారు.
ఈ నేపథ్యంలో బ్రిటీష్ కొలంబియాకు చెందిన సిక్కు కమ్యూనిటీ సభ్యులు మంగళవారం సర్రే కోర్టుకు పోటెత్తినట్లుగా కెనడాకు చెందిన వార్తాసంస్థ గ్లోబ్ అండ్ మెయిల్ పేర్కొంది.