చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ( Casting couch ) ఉందనే సంగతి మనకు తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి వచ్చి ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాము అంటూ బహిరంగంగా పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు.
అయితే తాజాగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ క్యాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి రమ్యకృష్ణ ( Ramya Krishnan ) చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.రమ్యకృష్ణ 90 లలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు.
ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు.ఇప్పటికీ కూడా రమ్యకృష్ణ వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ నటిగా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో సుమారు 200 కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి రమ్యకృష్ణ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఒక్కరంగంలో కూడా ఇలాంటి ఇబ్బందులు మహిళలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇక ఈ విషయం గురించి సెలబ్రిటీలు( Celebrities ) ఓపెన్ కావడంతోనే ఇండస్ట్రీ పై ఆ ప్రభావం కాస్త ఎక్కువగా చూపిందని రమ్యకృష్ణ తెలియజేశారు.ఇక చాలామంది క్యాస్టింగ్ కౌచ్ గురించి తప్పుడు ప్రచారాలు చేయడం కూడా నిజమేనని రమ్యకృష్ణ వెల్లడించారు.అయితే నా వరకు ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఎదురు కాలేదని ఈమె తెలిపారు.ఇక ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలకు కొనసాగాలి అంటే కొన్నిసార్లు హీరోయిన్స్ సర్దుకుపోవాల్సిందే అంటూ ఈ సందర్భంగా రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం యంగ్ హీరోలకు హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.