ఏపీలోని కూటమి నేతలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి( Mithun Reddy ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.తాము లిక్కర్, వడ్డీ వ్యాపారాలు ఎప్పుడూ చేయలేదని తెలిపారు.
ఆస్తులను కాపాడుకునేందుకే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ) బీజేపీలో చేరారని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు.ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుంగనూరుకు కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజంపేట ఎంపీ సీటుతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.ఎన్నికల తరువాత కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి హైదరాబాద్ కు తరిమేస్తామని తెలిపారు.







