ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసుతో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపిస్తూ ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.వీరిని వీడియో లింక్ ద్వారా తొలిసారిగా కోర్టు ఎదుట హాజరుపరిచారు.
ఈ నేపథ్యంలో బ్రిటీష్ కొలంబియాకు చెందిన సిక్కు కమ్యూనిటీ సభ్యులు మంగళవారం సర్రే కోర్టుకు పోటెత్తినట్లుగా కెనడాకు చెందిన వార్తాసంస్థ గ్లోబ్ అండ్ మెయిల్ పేర్కొంది.ఆరెంజ్ జంప్‌సూట్‌లు ధరించిన ముగ్గురు కోర్టు ముందు హాజరుకాగా.
ఖలిస్తానీ మద్ధతుదారులు న్యాయస్థానం వెలుపల పెద్ద ఎత్తున భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా నిందితులు కరణ్ బ్రార్, కరణ్‌ప్రీత్ సింగ్, కమల్‌ప్రీత్ సింగ్‌లను న్యాయమూర్తి డెలారామ్ జహానీ ప్రశ్నించారు.
అయితే బ్రార్, కరణ్‌ప్రీత్‌లు తమ న్యాయవాది ద్వారా మే 21న కోర్టు ఎదుట హాజరుకావాలని నిర్ణయించుకున్నారు.మరోవైపు న్యాయవాదిని కోరిన కమల్‌ప్రీత్ సింగ్‌కు కొత్త తేదీని కోర్టు ఇంకా నిర్ణయించలేదని గ్లోబ్ అండ్ మెయిల్ నివేదించింది.

కాగా.నిజ్జర్ హత్య( Hardeep Singh Nijjar murder )లో భారత ప్రభుత్వ ప్రమేయంపై కెనడియన్ పోలీసులు ఎలాంటి ఆధారాలు చూపలేదు.ఈ క్రమంలో అరెస్ట్ అయిన ముగ్గురు భారతీయుల ఫోటోలను మాత్రం శుక్రవారం వారు విడుదల చేశారు.కరణ్ ప్రీత్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్‌లను అల్బెర్టా ప్రావిన్స్‌లోని ఎడ్మంటన్ సిటీలో అరెస్ట్ చేశారు.
ఆర్‌సీఎంపీ (సర్రే)కి చెందిన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) శుక్రవారం ఉదయం ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ సాయంతో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముగ్గురిపై ఫస్ట్ డిగ్రీ హత్య, కుట్ర ఆరోపణలు వున్నాయి.వీరి ఫోటోలతో పాటు నిజ్జర్ హత్య సమయంలో నిందితులు ఉపయోగించినట్లుగా భావిస్తున్న కారు ఫోటోని కూడా పోలీసులు విడుదల చేశారు.నిజ్జర్ కేసు దర్యాప్తులో కెనడా భద్రతా యంత్రాంగం, ఆర్‌సీఎంపీ, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్‌పై తనకు పూర్తి విశ్వాసం వుందని కెనడా పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్ డొమినిక్ లెబ్లాంక్ ( Dominic leblanc )పేర్కొన్నారు.
ఈ విచారణ ఇక్కడితో ఆగదని.నిజ్జర్ హత్యలో కీలకపాత్ర పోషించిన మరికొందరు తమకు తెలుసునని ఐహెచ్‌ఐటీ ఇన్‌ఛార్జ్ మనదీప్ మూకర్ పేర్కొన్నారు.ప్రతీ ఒక్కరిని గుర్తించి అరెస్ట్ చేయడానికి తాము అంకిత భావంతో పనిచేస్తున్నట్లు మూకర్ తెలిపారు.అరెస్ట్ అయిన ముగ్గురూ భారతీయ పౌరులని, గత మూడు నుంచి ఐదేళ్లుగా కెనడా( Canada)లో శాశ్వత నివాసితులుగా జీవిస్తున్నారని మూకర్ చెప్పారు.
గడిచిన కొన్నేళ్లుగా భారత్‌తో సమన్వయం సవాల్‌గానూ, చాలా కష్టంగానూ వుందని ఆయన పేర్కొన్నారు.ఈ విషయంలో సిక్కు సమాజం మద్ధతుపై తన దర్యాప్తు ఆధారపడి వుందని మూకర్ వెల్లడించారు.







