కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా( Sam Pitroda ) వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గాంధీ పరివార్ సన్నిహితుడు మాట్లాడుతున్న మాటలకు మనం సిగ్గుపడాలని పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారని మాట్లాడారని మోదీ మండిపడ్డారు.ఈ వ్యాఖ్యలను తెలంగాణ, తమిళనాడు సీఎంలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు.
దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలను విభజించాలని మాట్లాడుతున్నారని తెలిపారు.శామ్ పిట్రోడా మాటలు మనలను బాధకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.
శామ్ పిట్రోడా వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థిస్తోందని విమర్శించారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.