కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ ఫైర్
TeluguStop.com
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా( Sam Pitroda ) వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గాంధీ పరివార్ సన్నిహితుడు మాట్లాడుతున్న మాటలకు మనం సిగ్గుపడాలని పేర్కొన్నారు.దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారని మాట్లాడారని మోదీ మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలను తెలంగాణ, తమిళనాడు సీఎంలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు.దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలను విభజించాలని మాట్లాడుతున్నారని తెలిపారు.
శామ్ పిట్రోడా మాటలు మనలను బాధకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.శామ్ పిట్రోడా వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థిస్తోందని విమర్శించారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.