పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్( Sujeeth ) డైరెక్షన్ లో వస్తున్న ఓజి సినిమా( OG MOVIE ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి.ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అంటూ అభిమానులు ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నారు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ముందుకు సాగుతున్నాడు.
ఇక ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ అయితే ఉంది.ఇక ఈ వర్క్ ని కూడా తొందర్లోనే ఫినిష్ చేసి సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు.అయితే ఈ సినిమా కోసం సుజీత్ విపరీతంగా కష్టపడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇప్పటి వరకు షూటింగ్ చేసిన సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేశారట.ఇక బ్యాలెన్స్ వర్క్ ను తొందర్లోనే షూట్ చేసి సినిమాను అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయాలని సుజీత్ చాలా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ క్రమంలో ఆయన అనుకున్నట్టుగానే సినిమా రిలీజ్ చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి చాలా మంచి మేకోవర్ ని కూడా ఇచ్చి నటనలో వేరియేషన్స్ ను కూడా ఆడ్ చేశారట.మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అనుకున్న సక్సెస్ దక్కుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా మీద సగటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు.
చూడాలి మరి ఈ సినిమాలో సుజీత్ పడిన కష్టం ఫలిస్తుందా లేదా అనేది…
.