రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారు..: హరీశ్ రావు

సిద్ధిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు( Brs Foundation Day Celebrations ) జరిగాయి.ఈ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) పార్టీ జెండాను ఆవిష్కరించారు.

 Revanth Reddy Is Exemplary In Insults Harish Rao-TeluguStop.com

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని హరీశ్ రావు తెలిపారు.మన పథకాలను కేంద్రం అమలు చేస్తోందన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.నాడు ఓటుకు నోటు, నేడు దేవుళ్లపైన ఓట్లు అంటూ విమర్శించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ క్రమంలోనే ఆగస్ట్ 15వ తేదీ లోపు రుణమాఫీ( Rythu Runa Mafi )తో పాటు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు.స్పీకర్ ఫార్మాట్ లో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కు పంపించాలన్నారు.

రుణమాఫీ చెయ్యాలని అడిగితే మంత్రులు తిడుతున్నారన్న ఆయన ప్రతిపక్ష నేతగా తాను పోరాటం చేస్తూనే ఉంటానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube