వీడియో: పాఠశాలకు వెళ్లే బాలికకి ఎదురుపడ్డ యాచకుడు.. ఆమె చేసిన పనికి కంటతడి!

బిచ్చగాడిగా( Beggar ) మారడానికి అనేక కారణాలు ఉంటాయి.యాచించే స్థితికి చేరుకుంటే ఆ జీవితం చాలా దారుణంగా ఉంటుందని చెప్పవచ్చు.

 School Girl Shares Her Tiffin With Blind Beggar Video,school Girl,beggar,emotio-TeluguStop.com

ఎందుకంటే వారిని అసహ్యించుకునే ప్రజలే సమాజంలో ఎక్కువగా ఉంటారు.కొందరు మాత్రమే తమకు నచ్చినంత దానం చేస్తారు.

ఒక్కోసారి కొందరికి పనులు దొరక్క వీధుల్లో భిక్షాటన చేయాల్సిన దుస్థితి నెలకొంటుంది.వీరు సిటీ అంతా తిరుగుతూ తినడానికి పట్టెడు అన్నం పెట్టండి అని అడుక్కుంటుంటారు.

అయితే ఇటీవల ఇలాంటి ఒక యాచకుడు పాఠశాలకు వెళ్తున్న ఒక విద్యార్థినికి ఎదురుపడ్డాడు.ఆ బాలిక( Girl ) అతడిని చూసి చలించిపోయింది.

అతడికి తన బాక్స్ లో ఉన్న ఫుడ్ అంతా ఇచ్చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఇది చూసి నెటిజనులు ఎమోషనల్ అవుతున్నారు.ఆ వీడియోలో ఒక బాలిక రోడ్డు పక్కన బిచ్చగాడికి సహాయం చేయడం మీరు గమనించవచ్చు.సదరు చిన్నారి మొదట తన లంచ్ బాక్స్ తెరిచి( Lunch Box ), ఆపై తన చేతులతో బిచ్చగాడికి తినిపిస్తుంది.దాన్ని బట్టి ఆ చిన్నారి మనసు ఎంత స్వచ్ఛమైనదో అర్థం చేసుకోవచ్చు.

ఈ బాలిక ప్రేమకు సదరు బిచ్చగాడు ఎమోషనల్( Beggar Emotional Video ) అయి కంటతడి పెట్టుకున్నట్లు కనిపించింది.ఈ విషయం సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలకు మించి అందర్నీ కదిలించింది.

స్కూల్ డ్రెస్లో ఉన్న ఈ బాలిక తన లంచ్ కోసం తెచ్చుకున్న బాక్స్ను బ్యాగ్ లోంచి తీసి బిచ్చగాడికి ఇచ్చింది.తర్వాత బిచ్చగాడికి డబ్బు కూడా ఇస్తుంది.అతడికి ఫుడ్ తినిపించిన తర్వాత, తన వాటర్ బాటిల్( Water Bottle ) కూడా అతనితో పంచుకుంటుంది.స్కూల్ యూనిఫాంలో ఉన్న ఈ చిన్నారి తన మంచి మనసుతో నెటిజన్ల హృదయాలను దోచేసింది.

ఆపై సోషల్ మీడియా( Social media )లో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఈ బాలిక వయసు చిన్నదే కానీ మనసు మాత్రం చాలా పెద్దది అని కొందరు కామెంట్ పెట్టారు.

చిన్నారులు దేవుళ్ళతో సమానం, అందరూ ఇలానే ఉండాలి అని మరి కొందరు వ్యాఖ్యానించారు.ఈ హార్ట్ టచింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube