సాధారణంగా చాలా మందికి బ్లాక్ టీ, గ్రీన్ టీ ల గురించే తెలుసు.కానీ, మనకు వైట్ టీ కూడా అందుబాటులో ఉంది.
గ్రీన్ టీ, బ్లాక్ టీ, వైట్ టీ మూడు ఒక మొక్కకు సంబంధించినవే అయినప్పటికీ.పండించే ప్రదేశం, పండించే విధానంను బట్టి వాటిలో పోషక విలువలు వేరు వేరుగా ఉంటాయి.
బ్లాక్ టీ, గ్రీన్ టీలతో పోటిస్తే వైట్ టీలో కెఫిన్ తక్కువగా, ఇతర పోషకలు ఎక్కువగా ఉంటాయి.అందుకే వైట్ టీ రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలనూ అందించగలదు.
మరి లేటెందుకు వైట్ టీతో లభించే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి.
అధిక బరువుతో నానా ఇబ్బందులు పడే వారికి వైట్ టీ అనేది ఒక అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు.
ప్రతి రోజు ఒక కప్పు చప్పున వైట్ టీని తీసుకుంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మెటబాలిజం రేటు పెంచుతాయి.మెటబాలిజం రేటు పెరిగితే క్రమంగా బరువు తగ్గుతాయి.
పైగా వైట్ టీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది.అందువల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును వైట్ టీ వేగంగా కరిగించేస్తుంది.
వైట్ టీని తీసుకుంటే గనుక శరీరంలో హానికరమైన పదార్థాలను, మలినాలను సులభంగా బయటకు వెళ్తాయి.అలాగే గుండె జబ్బుల్ని తగ్గించే గుణాలూ వైట్ టీలో ఉన్నాయి.రెగ్యులర్‌గా వైట్ టీని సేవిస్తే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.దాంతో గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.
జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.
మరియు ఒత్తిడి, తలనొప్పి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యల నుంచి ఉశపమనం లభిస్తుంది.
.