నాగార్జున దాదాపు నాలుగు ఏళ్లుగా ఊరిస్తున్న బంగార్రాజు సినిమా ఇటీవలే పట్టాలెక్కింది అంటూ వార్తలు వచ్చాయి.కాని తాజాగా నాగార్జున వ్యవహరిస్తున్న తీరు మరియు ఆయన మాట్లాడుతున్న మాటల తీరు చూస్తుంటే ఆయన బంగార్రాజు సినిమాను మొదలు పెట్టాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల ఆయన వైల్డ్ డాగ్సినిమా విడుదల సందర్బంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.ఆ సందర్బంగా బంగార్రాజు పై స్పందించేందుకు ఆయన నిరాకరిస్తున్నారు.
ప్రస్తుతానికి వైల్డ్ డాగ్ గురించే మాట్లాడుదాం అన్నట్లుగా ఆయన బంగార్రాజు టాపిక్ ను తప్పిస్తున్నట్లుగా చెబుతున్నారు.మొత్తానికి నాగార్జున బంగార్రాజు సినిమా గురించి మళ్లీ సస్పెన్స్ నెలకొంది.
సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని బంగార్రాజు పాత్రతో నాగార్జున ఆకట్టుకున్నాడు.కనుక ఆ పాత్రను బేస్ చేసుకుని బంగ్రరాజు సినిమా చేయాలని మొదట అనుకున్నాడు.ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.
ఇటీవల పట్టాలెక్కింది అంటూ వార్తలు వచ్చినా మళ్లీ ఆ వార్తలు నిజం కాదేమో అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.