తెలుగులో వరుసగా భారీ విజయాలను సొంతం చేసుకున్న సమంత ప్రస్తుతం సొంత భాషలో తన సత్తా చాటే ప్రయత్నంలో ఉంది.తెలుగులో భారీ క్రేజ్ ఉన్న సమయంలోనే ఈమె తమిళం వైపుకు అడుగులు వేసింది.
అక్కడ కూడా మంచి సక్సెస్‌లు రావడంతో పాటు, వరుసగా స్టార్ హీరోలతో ఛాన్స్‌లు వస్తున్నాయి.దాంతో తెలుగు మరియు తమిళంలో ఈమె వరుస చిత్రాల్లో నటిస్తూ సౌత్ స్టార్ హీరోయిన్‌గా దూసుకు పోతుంది.
తాజాగా ఈమెకు తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే అవకాశం దక్కింది.
ఇప్పటికే ఈమె ధనుష్‌తో ‘వీఐపీ 2’ చిత్రంలో ధనుష్‌తో నటిస్తోంది.
ఆ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది.ఈ నేపథ్యంలో మరోసారి ఆయనతో ఈమె రొమాన్స్‌కు రెడీ అవుతోంది.
ధనుష్ సొంతంగా నిర్మించబోతున్న ‘వడ చెన్నయ్’ సినిమాలో హీరోయిన్‌గా సమంత ఎంపిక అయ్యింది.ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈ సినిమాను అతి త్వరలో సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు.మరో వైపు ఈమె తెలుగులో మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ మరియు నితిన్, త్రివిక్రమ్‌ల మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అటు తమిళంలో విక్రమ్ మరియు సూర్యలతో ఒక్కో సినిమా చొప్పున నటిస్తూ ఉంది.ఇలా అక్కడ, ఇక్కడ స్టార్స్‌ను తన బుట్టలో వేసుకుని మళ్లీ మళ్లీ వారితో నటించే అవకాశాన్ని దక్కించుకుంటుంది.







