యాదాద్రి జిల్లా:వైద్యో నారాయణో హరీ అన్న నానుడికి అర్థం మారిపోతోంది.కనిపించని దేవుళ్లకన్నా ప్రాణం పోసే వైద్యులనే దేవుళ్లుగా భావిస్తుంటారు ప్రజలు.
అయితే ప్రస్తుత సమాజంలో చాలా మంది వైద్యులు యమభటులుగా తయారయ్యారు.రోగుల పాలిట యమకింకరులవుతున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది.భువనగిరి జిల్లా ఆస్పత్రిలో ఓ వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.
అంతేకాకుండా వైద్యం చేయకుండా ఆసుపత్రి దాటి వెళ్లిపోయారు.ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఆసుపత్రి సిబ్బంది మిన్నకుండి పోయారు.
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కోసం కొందరు మహిళలు భువనగిరి ఆసుపత్రికి వచ్చారు.ముందుగా అనుకున్న పక్రారం ఆ రోజే ఆపరేషన్ చేయాలి.
ఆపరేషన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఆపరేషన్‌కు ముందు 12 మంది మహిళలకు డాక్టర్ మత్తు ఇంజక్షన్లు ఇచ్చాడు.
ఇప్పుడే అసలు కథ మొదలైంది.సదరు డాక్టర్ మత్తు ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేయనని వెళ్లిపోయాడు.
ఆస్పత్రి వైద్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఉదయం నుంచి ఆస్పత్రి ఎదుట బంధువుల పడిగాపులుకాశారు అయినా ఫలితం లేకపోవడంతో మహిళల కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.ఇంతటి బాధ్యతారాహిత్యానికి పాల్పడిన సదరు డాక్టర్ గారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలి మరి…?
.