నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్( Narcut Pally Police Station ) ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్( Candidate Ashok Kumar ) పీఎస్ ఎదుట నిరసనకు దిగారు.
కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడికి పాల్పడ్డారని అశోక్ కుమార్ ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన ఆయన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్( Congress ) డబ్బులు పంచుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.కాగా డబ్బులు పంచుతున్నారని అనుమానంతో కాంగ్రెస కార్యకర్తలున్న ఫంక్షన్ హాల్ లోకి అశోక్ కుమార్ వెళ్లారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ క్యాడర్ కు, అశోక్ కుమార్ కు మధ్య చెలరేగిన వివాదం పరస్పర తోపులాటకు దారి తీసిన సంగతి తెలిసిందే.