కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించండి:షబ్బీర్ అలీ

నల్గొండ జిల్లా:కేంద్రంలో బీజేపీ,రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికారాన్ని అడ్డంపెట్టుకొని,వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రజల ఆత్మ గౌరవాన్ని అణిచివేయాలని చూస్తున్నాయని మాజీ మంత్రి, చండూర్ మండల ఉప ఎన్నికల కాంగ్రేస్ ఇంచార్జ్ షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు.బుధవారం చండూర్ మండల కేంద్రంలోని భవాని ఫంక్షన్ హాల్ లో జరిగిన కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడుతూ తన స్వలాభం కోసం బీజేపీ పార్టీ ఇచ్చిన ఆఫర్ కి అమ్ముడుపోయిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

 Win Congress With Huge Majority: Shabbir Ali-TeluguStop.com

ఈ నియోజకవర్గానికి తాను చేసిన అభివృద్ధి ఏమిలేదని,మళ్ళీ గెలిస్తే ఒరిగేది కూడా ఏమిలేదని ఏద్దేవా చేశారు.ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడి లాగా పనిచేయాలన్నారు.

ఖచ్చితంగా మునుగోడులో కాంగ్రేస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ హయంలో చేసిన మంచి పనులని ప్రజలకి వివరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఆఖరిశ్వాస వరకు కాంగ్రెస్ లోనే కొనసాగిన వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అని,ఇప్పుడు ఆయన కూతురు స్రవంతిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చల్లమల కృష్ణారెడ్డి,పున్న కైలాష్ నేత,పల్లె రవి కుమార్,ఈరవర్తి అనిల్ కుమార్, శివసేన రెడ్డి,మండల కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube