నల్లగొండ జిల్లా:తెలుగుదేశం పార్టీ బలోపేతం అయితేనే తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు బలపడతారాని తెలుగుదేశం పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు.నాంపల్లి మండలం చిట్టెంపాడులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో బడుగు బలహీన వర్గాలు పేదలు అన్ని రంగాలలో అణిచివేతకు గురి అవుతున్నారని ఆరోపించారు.తెలుగుదేశం ఆవిర్భావం తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో పటేల్,పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, పెత్తందారీ వ్యవస్థకు స్వస్తి పలికి,పేద వర్గాలకు అండగా నిలిచినది అన్నారు.
టీడీపి హాయంలో ఎన్టీఆర్,చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నేటికి ప్రజలు మర్చిపోలేదని,వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేస్తామని అన్నారు.తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోవడం గర్వంగా భావించాలని,పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం కీలకం కానుంది అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ఆర్యవైశ్య రాష్ట్ర కార్యదర్శి పార్వతమ్మ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పగడాల లింగయ్య, నాయకులు వజ్జ వెంకట్ రెడ్డి,దనబోయిన నరేష్, మంగి మహేష్,కొండ్రపెళ్లి కృష్ణయ్య,బుషపాక యాదయ్య,రాములు,కోరే బాలయ్య,బుగ్గయ్య, లింగయ్య,ఉగ్గపెళ్లి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.