నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు...!

నల్లగొండ జిల్లా: నల్లగొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభం కానుంది.బ్యాలెట్‌ ఓట్లు కావడంతో ఫలితం వెలువడడానికి రెండు రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

 Counting Of Mlc By-election Votes Of Graduates Today, Counting ,mlc By-election-TeluguStop.com

గత నెల 27వ తేదీన నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.ఉప ఎన్నికలో మొత్తం 72.44 శాతం పోలిం గ్‌ జరిగింది.నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పలపల్లి గోదాములో ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది.

బ్యాలెట్‌ అన్నింటిని బండిల్స్‌గా కట్టి అనంతరం లెక్కిస్తారు.మూడు ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్‌ స్టేషన్లలో నమోదైన ఓట్లను మూడు విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగనుంది.

మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థి గెలవక పోతే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను ప్రకటిస్తారు.మొత్తం 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపును చేపడుతారు.3,36,013 ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది.మొదట తొలి ప్రాధాన్యం ఓట్లు లెక్కింపు చేస్తారు.ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కోసం 2,800 మంది అధికారులు,సిబ్బందిని నియమించారు.ఇందులో 1,100మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లతో పాటు కౌంటింగ్‌ అసిస్టెంట్లు 37 మంది ఏఆర్‌వోలు,40 మంది తహసీల్దార్లను నియమించారు.అదేవిధంగా 12 జిల్లాల నుంచి మరో 300మంది సిబ్బందిని కేటాయించారు.

కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144సెక్షన్‌ అమలు చేయనున్నారు.మంగళవారం పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్దులు భారీ మెజారిటీతో గెలవడంతో హస్తం పార్టీ ఊపుమీదుంది.ఇదే జోరులో నేడు నల్లగొండ, ఖమ్మం,వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్దిగా ప్రేమేందర్ రెడ్డి,బీఆర్ఎస్ అభ్యర్దిగా ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మొత్తం 52 మంది బరిలో ఉన్నారు.

అభ్యర్దులు గెలుపు కోటా రీచ్ అయ్యేంత వరకు ఎలిమినేషన్ పద్దతిలో కౌటింగ్ జరిగే అవకాశం ఉంది.

రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడితే మాత్రం మూడు రోజుల పాటు కౌంటింగ్ జరిగే ఆస్కారం ఉందని తెలుస్తోంది.ఈ కౌంటింగ్ కు నల్గొండలోని వేర్ హౌసింగ్ గౌడన్స్ లోని 4 హాల్స్ లో మొత్తం 96 టేబుల్స్ ఏర్పాటు చేశారు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపే లెక్కింపు ఉంటుంది.24 గంటల పాటు ఓట్ల లెక్కింపు చేపట్టేలా షిఫ్ట్ ల వారిగా సిబ్బందిని నియామకం చేశారు.ఒక్కో షిప్ట్ లో 900 మంది సిబ్బంది పాల్గొంటారు.రౌండ్ దీ క్లాక్ 24 గంటల పాటు కౌటింగ్ ఉంటుందని,మొదటి రౌండ్ లో బండిల్స్ కట్టే ప్రక్రియ ఉంటుందని,రెండో రౌండ్ లో చెల్లుబాటైన ఓట్లను, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేసేప్రక్రియ చేపట్టి,చెల్లుబాటైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు ఎవరికొస్తే వారే విజేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube