పెట్రోల్ ధరల దోపిడీ ఆపాలి-కార్పొరేట్ కంపెనీల దోపిడీ రద్దు కావాలి...!

నల్లగొండ జిల్లా: బీజేపీని గద్దె దించుదాం,బీదసాధ పేదలను రక్షించుకుందామని బహిరంగ లేఖ ద్వారా దేశ ప్రజలకు ప్రజా బంధువు,సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు.అంతర్జాతీయంగా ముడిచమురు ధర 70 డాలర్ల లోపు చేరిన నేపథ్యంలో ఆ మేరకు పెట్రోల్ రేటును తగ్గించేందుకు కేంద్రం విధించిన సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలని భారత ప్రధానమంత్రికి సిపిఐ (ఎంఎల్) సెక్రటరీ, బాధితుల బంధువు కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 Exploitation Of Petrol Prices Should Be Stopped-exploitation By Corporate Compan-TeluguStop.com

జెఎస్ఆర్ బహిరంగ లేఖ సారాంశం…

కార్పొరేట్ల లాభాల కోసమే దోపిడీదారుల పెట్రో బాదుడు యాత్ర కొనసాగుతుందని,దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదంటూ గతంలో వామపక్ష ప్రజాతంత్ర మేధావులు చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైందని తెలిపారు.2014 నుంచి ఇప్పటి వరకు 45 శాతానికి పైగా ధరల పెంపు,ముడి చమురు పొదుపు ప్రయోజనం ఒకట్రెండు కంపెనీలకేనా నిలదీశారు.మోడీ కఠిన ప్రధాని అని, అంబానీ,ఆదానీల కార్పొరేట్ దొంగల లాభాలు పెంచేందుకు దేశంలో తనలాంటి కోట్లాదిమంది పేదల,సామాన్యుల,రక్త మాంసాలను పీల్చి పిప్పిచేసి మోడీ తాగుతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు.పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్,డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటున్నదన్నారు.ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు (Crude Oil) ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందని ఎద్దేవా చేశారు.

2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు,దేశంలో లీటర్ పెట్రోల్(Petrol) రేటు కేవలం 76రూపాయలు.కానీ,నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా అంటే 66 డాలర్లకు తగ్గినా,ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు.

అందుకే దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని అనేకమంది ప్రజాతంత్ర వాదులు గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైందని గుర్తు చేశారు.కేవలం ముడి చమురును ఒక బూచిగా చూపించి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురులు ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతున్నదని ఆరోపించారు.

పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద,సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి మొదలుకొని పప్పు ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయని,భారీగా పెరిగిన డీజిల్ ధరల వలన ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచున చేరుతోందని,దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించిందని విమర్శించారు.అలాగే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత నలభై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్బనం దేశాన్ని పట్టిపీడిస్తోందని మండిపడ్డారు.

ప్రయోజనమంతా ఒకటి,రెండు కంపెనీలకే కాదా…??

ఒకవైపు రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకు భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం,పెట్రోల్ ధరల పెంపుతో చేస్తున్న దోపిడీపై సమాధానం ఇవ్వడం లేదని,కేంద్ర ప్రభుత్వం చెబుతున్న రూ.35 వేల కోట్ల ముడిచమురు పొదుపు ప్రయోజనమంతా కేవలం ఒకటి,రెండు చమురు కంపెనీలకే దక్కిందన్నది వాస్తవమని, రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురును శుద్ధిచేసి తిరిగి విదేశాలకు అమ్ముకుంటున్న కీలకమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దాచిపెడుతోందని, అలా కంపెనీలకు వచ్చిన అడ్డగోలు లాభాలను దృష్టిలో పెట్టుకుని,దానిపై ప్రభుత్వానికి వచ్చే ‘విండ్ ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విషయాన్ని గమనించాలని ప్రజలను,ప్రజాస్వామిక వాదులను ప్రజా నేస్తం కమిటీ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు.

కార్పొరేట్ కంపెనీలకు పన్నులు తగ్గించినా,దేశ ప్రజలపై ధరల భారాన్ని మోపుతున్న కఠినాత్ముడు ప్రధానమంత్రి మోదీ అని ప్రజలు గుర్తుంచుకోవాలని సుభాషన్న విజ్ఞప్తి చేశారు.కేంద్ర ప్రభుత్వం సెస్సుల పేరుతో రూ.30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి కొల్లగొట్టిందని,పెట్రో భారం తగ్గాలంటే,భారతీయ జనతా పార్టీని వదిలించుకోవడమే ఏకైక మార్గం’ అని లేఖలో కోరారు.తక్కువ ధరకు ముడి చమురును కొని తిరిగి విదేశాలకే పెట్రోలు అమ్ముతున్న కంపెనీలకు వచ్చిన అడ్డగోలు లాభాలను దృష్టిలో పెట్టుకుని,దానిపై ప్రభుత్వానికి వచ్చే విండ్ ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విషయాన్ని గమనించాలని, కార్పొరేట్ కంపెనీలకు పన్నులు తగ్గించినప్పటికీ, దేశ ప్రజల పట్ల మాత్రం పెట్రోల్ పేరుతో దోపిడీని కొనసాగిస్తున్న కఠినాత్ముడు ప్రధానమంత్రి మేదీ అని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరుతున్నట్టు బాధితుల తెలిపారు.అడుగడుగునా భారత ప్రజలను దగా చేసిన మోసం చేసిన ప్రజా వ్యతిరేక భారతీయ జనతా పార్టీని రాబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని దేశ ప్రజలకు దేశాభిమాన్యుడు, ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube