నల్లగొండ జిల్లా:కేసీఅర్ గద్దె దించడం,బీఆర్ఎస్ పార్టీ( BRS party )ని బొంద పెట్టడమే తన ఏకైక లక్ష్యమని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా( Nalgonda District ) మునుగోడు మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్,బీజేపీ( BJP ) రెండూ ఒకటై తనను ఓడించాలని కుట్ర పన్నుతున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా
కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండి గుండెల్లో పెట్టుకుంటానన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్వాయి స్రవంతి రెడ్డి,పున్న కైలాస నేత,కుంభం శ్రీనివాస్ రెడ్డి, పొలాగోని సత్యం,మేకల ప్రదీప్ రెడ్డి,తాడూరి వెంకట్ రెడ్డి,వేమిరెడ్డి సురేందర్ రెడ్డి,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీమనపెల్లి సైదులు, నన్నూరి విష్ణువర్ధన్ రెడ్ది, చెన్నారెడ్డి,దోటి వెంకన్న, కోడి గిరిబాబు,పందుల భాస్కర్ తదితరులు తదితరులు పాల్గొనారు
.