చాలా మంది ప్రజలు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.కానీ కొంత మంది స్త్రీలు మరియు పురుషులలో బరువు తక్కువగా ఉన్నప్పటికీ నడుము చుట్టూ కొవ్వు మాత్రం ఎక్కువగా ఉండి లావుగా కనిపిస్తూ ఉంటారు.
అలాంటి వారు ఎన్ని రకాల డైట్ లు పాటించిన సరే నడుము చుట్టుకొలత తగ్గక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటి వారి కోసం ప్రకృతి ప్రసాదించిన బూడిద గుమ్మడికాయతో ( Gray pumpkin )తయారుచేసిన జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇందులోని సుగుణాల వల్ల బెల్లీ ఫ్యాట్( Belly fat ) వెన్న కరిగినట్టు కరుగుతుంది.

అటువంటి గుమ్మడికాయ జ్యూస్( Gray pumpkin juice )ఎలా తయారు చేసుకోవాలి? ఎప్పుడెప్పుడు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.బెల్లీ ఫ్యాట్ ( Belly fat )తగ్గించగడానికి రోజు ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ ని తాగడం మంచిది.దీని కోసం ముందుగా వంద గ్రాముల బూడిద గుమ్మడికాయ ముక్కలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి.
అందులో ఒక స్పూన్ తేనె ( Honey )రెండు నుంచి మూడు స్పూన్ల నిమ్మరసం ( Lemon juice )వేసి బాగా మిక్సీ పట్టుకుని చిటికెడు జీలకర్ర పౌడర్ కలిపి తాగాలి.ఇలా తాగడం వల్ల ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడంతో తొందరగా ఆకలి వేయకుండా చేసి పదేపదే తినాలని కోరికను దూరం చేస్తుంది.
బూడిద గుమ్మడికాయలో ఫైబర్ పుష్కలంగా లభించడంతో పొట్ట చుట్టూ కొవ్వును కరిగించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

అంతే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ( Antioxidants )మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండి మెటపాలిజం రేటును పెంచుతాయి.దీనితో శరీరంలో యాక్టివ్ స్టేజ్ లో ఉండి మెదడు తినాలని కోరికను దూరం చేస్తుంది.దీనితో ఓవర్ ఈటింగ్ అనేది క్రమంగా తగ్గిపోతుంది.
అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కొంతమంది మహిళలు అధిక బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అటువంటి వారికి కూడా బుడిద గుమ్మడికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా జింక్ అనే ఎంజైమ్ ఎక్కువగా లభించడంతో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది.కాబట్టి మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే బూడిద గుమ్మడికాయ జ్యూస్ ని మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.