నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ ( BRS party )ఆఫీసు ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మించారని,దానిని వెంటనే కూల్చివేయాలని రాష్ట్ర ఆర్ అండ్ బీ మంత్రి,నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్,మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.మంత్రి ఆదేశాలపై అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతున్న సమయంలోమరోసారి మున్సిపల్ అధికారులకు సీరియస్ గాసూచించారు.
దీనితో బీఆర్ఎస్ కూల్చివేసే దిశగా మున్సిపల్ అధికారులు అడుగులు వేశారు.దీనితో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మంత్రి ఆదేశాలపై మండిపడ్డారు.
అధికారులపై వత్తిడి తేవడం కాదు, దమ్ముంటే నువ్వు టచ్ చేసి చూడు అంటూ ఓపెన్ సవాల్ విసరడంతో అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య స్టేట్ లెవల్ ఇష్యూ గా మారి పొలిటికల్ హీట్ పెరిగింది.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆ హీట్ కాస్త చల్లారింది.
బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.ఇరువైపులా వాదనలు విన్న కోర్టు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను 15 రోజుల్లో కూల్చివేయాలని సంచలన తీర్పు ఇచ్చింది.
దీనిపై నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ( Kancharla Bhupal Reddy )స్పందించారు.నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చేయాలన్న హైకోర్టు ఆదేశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, ఇచ్చిన ఆదేశంపై అప్పీల్ కు వెళ్తున్నామన్నారు.
అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని, కూల్చేస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు.రాష్ట్రంలో ఏ పార్టీ ఆఫీసుకు అనుమతులు లేవని,కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.
కూల్చడమే పనిగా పెట్టుకుందని, కూల్చడం కాదు నిలబెట్టడం నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు.అసలు ఈ వివాదానికి కారణమైనగులాబీ భవనం గుట్టు ఏమిటి…?నల్లగొండ జిల్లా కేంద్రంలో అత్యంత విలువైన ప్రాంతమైన హైదరాబాద్ రోడ్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది.ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కు చెందిన విలువైన భూమిలో ఎకరం స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది.అది కూడా ఏడాదికి గజానికి కేవలం రూ.100 మాత్రమే లీజు చెల్లించేలా అతి తక్కువ అమౌంట్ కు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ జిల్లా శాఖకు లీజుకు ఇచ్చింది.ఆగ్రోస్ నుంచి లీజుకు తీసుకున్న ఎకరా స్థలం కంటే ఎక్కువ స్థలాన్ని అక్రమించి భవనం నిర్మించారని ఆరోపణలు కూడా ఉన్నాయి.
రాష్ట్రంలో,జిల్లాలో కూడా అధికార మార్పిడి జరగడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గులాబీ భవనం గుట్టు విప్పడం మొదలెట్టారు.ఎలాంటి మున్సిపల్ అనుమతులు తీసుకోకుండా అక్రమంగా ముఖ్యమైన ప్రాంతంలో, విలువైన భూమిలో పార్టీ ఆఫీస్ నిర్మించారని,దానిని ప్రభుత్వ ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని అంటూ వస్తున్నారు.
మార్కెట్ రేటు ప్రకారం బీఆర్ఎస్ ఆఫీసు నిర్మించిన స్థలం విలువ రూ.2 కోట్ల పైమాటే ఉంటుందని అంచనా.ఈ వివాదం హస్తం,గులాబీ పార్టీల మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గుమనే స్థితికి చేరుకుంది.ఇప్పుడు హైకోర్టు తీర్పు గులాబీ పార్టీకి వ్యతిరేకంగా రావడంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు మున్సిపల్ అధికారులు ఫైనల్ నోటీసులు కూడా ఇచ్చేశారు.
జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఏకపక్షంగా విలువైన భూమిని లీజు కింద తీసేసుకుందన్న ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి.వాస్తవానికి నల్గొండ టౌన్ లో టీడీపీ,బీజేపీ,సీపీఐ, సీపీఎం పార్టీలకు సొంత ఆఫీసు భవనాలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీకి స్థానిక ప్రకాశం బజార్ లో పాత బస్టాండ్ సమీపంలో భూమి ఉన్నా పార్టీ ఆఫీస్ నిర్మాణం అరకొర పనుల తర్వాత నిలిచిపోయింది.అయితే,బీఆర్ఎస్ మొదటి నుంచీ పార్టీ కార్యాలయాన్ని అద్దె భవనంలోనే కొనసాగించింది.2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం హయాంలో పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపు జరగలేదు.2018 లో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు భూముల కేటాయింపు,భూమి పూజలు,భవన నిర్మాణ పనులు చకచకా పూర్తయ్యాయి.2023లో మూడోసారి తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతి నుంచి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది.నల్గొండ జిల్లా కేంద్రంలో ఆగ్రోస్ సంస్థకు ఉన్న విలువైన భూమిలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు.
మిగిలిన భూమిలో బీఆర్ఎస్ కు ఎకరం స్థలాన్ని 99 ఏళ్లకు అతి తక్కువ లీజ్ అమౌంట్ కు ఇవ్వడంపై మొదట్లోనే విమర్శలు,వ్యతిరేకత వచ్చింది.అయితే,అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండడం, జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యేతో పాటు,…
.