నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలో నిలిపి ఉన్న వాహనాల అద్దాలు పగులగొట్టి వరుస చోరీలకు పాల్పడుతున్న కేటుగాళ్లు పోలీసులకు సవాల్ గా మారారు.2024 జనవరి 30న పట్టణానికి సమీపంలోని అవంతిపురం సంతలో పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి రావుల శేఖర్( Ravula Shekhar ) తన యొక్క మేకలను అమ్మగా వచ్చిన రూ.2లక్షలు టాటా ఏసిజి వాహనంలో పెట్టి తాళాలు వేసుకొని ఎదురుగా వున్న హోటల్ లో భోజనం చేసి వచ్చే సరికి వాహనం అద్దాలు పగులగొట్టి అందులో వున్న రూ.2 లక్షలు ఎత్తుకెళ్లారు.బాధితుడు 100 కు ఫోన్ చేసి చెప్పడంతో రూరల్ పోలీసుల వచ్చి పక్కన షాపులోని సీసీ కెమెరా( CC camera )లో రికార్డు అయినా దృశ్యలను చూసి త్వరలోనే విచారణ చేసి నిందితులను పట్టుకుంటామని వెళ్ళిపోయారు.ఈ ఘటన మరువకముందే శనివారం వేములపల్లిలోని ఎస్బీఐ బ్యాంకు నుంచి రెండు లక్షలు విత్ డ్రా చేసుకొని మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెంలో వాహనాన్ని నిలిపి తమ బంధువుల ఇంటికి వెళ్లారు.
గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలను పగులగొట్టి కారులో వున్న 2లక్షల రూపాయలు చోరీ చేశారు.వెంటనే గుర్తించిన బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించడం జరిగింది.
బాధితుడు శెట్టిపాలెం గ్రామానికి చెందిన గౌరు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.ఈ వరుస ఘటనలు సిసి కెమెరాల్లో రికార్డు అయినా ఇంతవరకు దుండగులను పట్టుకోలేకపోవడం గమనార్హం.
ఇప్పటికైనా ఈ వరుస చోరీలకు అరికట్టే చర్యల్లో భాగంగా పోలీసులు( Police ) నిఘాను పటిష్టం చేసి,చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకొని,కొట్టేసిన సొమ్మును రికవరీ చేయాలని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.