నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం( Marriguda )లోని పలు గ్రామాల్లో రాత్రిపూట వెలుగులు ఇవ్వాల్సిన వీధి దీపాలు పగలు కూడా వెలుగుతూ విద్యుత్ వృథా అవుతుందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నా చూస్తూ పోతున్న విద్యుత్ అధికారులు ( Electricity authorities )ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం నిరంతరం విద్యుత్‌ని అందించడానికి వేలకోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తుంటేవిద్యుత్తును ఆదా చేయాల్సినవిద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
రాత్రి పూట వెలిగి తెల్లారి ఆపుటకు ఆన్ ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేస్తే విద్యుత్ ను ఆదా చేయొచ్చని అంటున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో వీధిలైట్లకు ప్రత్యేక ఆన్ ఆఫ్ స్విచ్ లు ఏర్పాటు చేసి,విద్యుత్ వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.







