కరోనా కాటు-పేదల జీవితాలపై వేటు

కరోనాతో నలిగిపోయిన బడుగుల బతుకులపై సర్వే.చదువులు దూరం- బతుకులు భారం.

 Corona Bite-poor Lives-TeluguStop.com

కోవిడ్ వ్యధా చిత్రం-కరోనా కాటుకు కార్మిక,కర్షక,శ్రమజీవుల బతుకులు ఛిద్రం.పాలకులారా కరుణించండి విద్యా,వైద్య అవకాశాలను ప్రభుత్వమే కల్పించాలి.

పార్టీ కార్యదర్శి కామ్రేడ్ బోర సుభాషన్న డిమాండ్.ఉన్నత చదువులకు దూరం-దొరికిన ఉద్యోగం చేసుకోవాల్సిన దైన్యం.

పాలకులారా పాపాత్ములుగా ఇంకెంత కాలం ప్రజలను భక్షిస్తారు?అంబానీ,ఆదానీ లాంటి,కార్పొరేట్ దొంగలను రక్షిస్తారు? దొంగలకు రక్ష- ప్రజలకు శిక్ష? కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా నేస్తం సుభాషన్న లేఖ.ఇంటింటా చీకటే ప్రతికంటా కన్నీరే- బోర సుభాషన్న లేఖలు,కారు చీకట్లో కాంతి రేఖలు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కామ్రేడ్ బోసన్న పిలువు.సుభాషన్న లేఖ-ప్రజా పోరాటాల పొలికేక.

నల్లగొండ జిల్లా:కోవిడ్ కొట్టిన దెబ్బ లక్షలాది మంది విద్యార్థి,యువతపై ప్రభావం చూపింది.కోవిడ్ తో వారు చదువులను,భవిష్యత్తు ఆశలను వదిలేసుకుని, చాలీచాలని జీవితాలతో కాలం గడుపుతూ, ఉద్యోగం,ఉపాధి వేటలో నలిగిపోతున్నారని ప్రముఖ ప్రజా ఉద్యమకారుడు,సిపిఐ (ఎంఎల్) కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బోర సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రామిక పోరాట యోధురాలు,వీర తెలంగాణ రైతాంగ పోరాట ఆత్మగౌరవ మహిళ,అమరజీవి కామ్రేడ్ మున్న గంగక్క యాదవ్ స్మారకోత్సవాలను పురస్కరించుకొని భారత్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ అవేర్నెస్ ఆధ్వర్యంలో కోవిడ్ పంజాతో నలిగిపోయిన బతుకులపై బోరన్న సర్వే చేశారు.కోవిడ్ తర్వాత సమాజంలో తిరిగి ఉపాధి అవకాశాలు పెరిగాయని విద్యార్థులు చదువుల వైపు,యువత ఉద్యోగాల వైపు పరుగులు పెడుతున్నారని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు పచ్చి బూటకమని బోర సుభాషన్న తేల్చి చెప్పారు.

ప్రభుత్వాల సర్వేలు, పాలకులకు డబ్బా కొట్టే కార్పొరేట్ మీడియా చెబుతున్న మాటలకు,వాస్తవ జీవితాలకు చాలా తేడా ఉందని,అనేక విషాదగాథలు దీని వెనుక ఉన్నాయని బోరన్న తెలిపారు.నల్గొండకు చెందిన నాగరాజు ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఎమ్మెస్ చదివేందుకు అమెరికా వెళ్లాలనుకున్నాడని,ఇందుకోసం ఏర్పాట్లు చేసిన నాగరాజు తండ్రి మోహన్ ని కోవిడ్ బలి తీసుకుందని,ఇప్పుడు ఆ కుటుంబాన్ని పోషించేందుకు వ్యవసాయ కూలి పనులు చేస్తున్నాడని ప్రజా శ్రేయోభిలాషి బోర సుభాషన్న తీవ్రంగా బాధ పడ్డారు.

మరిపెడ బంగ్లాకు చెందిన మల్లేష్ బీటెక్ పూర్తి చేశాడని,తర్వాత ఎంటెక్ చేయాలనుకున్నాడని కానీ,మల్లేష్ వాళ్ళ అమ్మ మంగమ్మకు 2020 లో కోవిడ్ వచ్చి చికిత్స ఖర్చులకు 25 లక్షలు ఖర్చు అయ్యిందని,అప్పుల పాలైన మల్లేష్ కుటుంబం పిల్లలను చదివించే స్తోమత లేకపోవడం వల్ల హైదరాబాదులో కడియం కనకయ్య దగ్గర కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడని ప్రజా పక్షవాది బోర పేర్కొన్నారు.కరోనా బాధిత ప్రజలు అప్పులపాలై అలమటిస్తున్నారని,విద్య,పౌష్టికాహార లోపం,మానసిక సంతోషం వారికి దూరమైందని బోరన్న సర్వే చాటి చెప్పింది.

కోట్లాదిమంది పేద మధ్యతరగతి ప్రజల జీవితాలను కోవిడ్ మహమ్మారి చిదిమివేస్తే అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్ దిగ్గజాల సిరి సంపదలు పెట్టుబడుల లాభాలు,కరోనా కాలంలో కూడా లక్షల కోట్లకు చేరాయని బోరన్న విమర్శించారు.బడాబూర్జువా,భూస్వామ్య,ధనస్వామ్య వర్గాల, పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్న నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి,కెసిఆర్ లు పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విప్లవ నేతాజీ సుభాష్ బోరన్న విమర్శించారు.

రోజువారీ కూలీలు,భవన నిర్మాణరంగం లాంటి కార్మికులు,ఇతర రెక్కాడితే గాని డొక్కాడని శ్రమజీవులు,పేదల కుటుంబాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని అతలాకుతలం అవుతున్నారని బోరన్న 9848540078 ఆవేదన వ్యక్తం చేశారు.వీరిలో 75% కుటుంబాల్లో ఇంటికి ఒక్కరైనా ఉద్యోగం కోల్పోయారని,స్వయం ఉపాధి పొందే వారిలో 66% మంది ఆర్థికంగా దెబ్బతిన్నారని, 68 శాతం కుటుంబాల్లో 15-25ఏళ్ల మధ్య యువత విద్యకు దూరమైనారని సిపిఐ (ఎంఎల్) కార్యదర్శి కామ్రేడ్ సుభాషన్న 8328277285/ 9848540078 పేర్కొన్నారు.33శాతం మందికి చదువుపై ఆసక్తి ఉన్నా ఆర్థిక అవకాశాలు లేక,ఉపాధి,ఉద్యోగం కోసం పనులకు వెళ్తున్నారని బోరన్న తెలిపారు.వాస్తవానికి లాక్ డౌన్ తర్వాత 20-25 ఏళ్ల యంగర్ గ్రూప్ వారు ఉద్యోగాల్లోకి ఎక్కువగా వచ్చారని,కానీ,ఇవేవీ వారి చదువుకు తగ్గ అవకాశాలు కాదని విద్యార్థి జేఏసీ చైర్మన్ నోముల శేషు యాదవ్ 9293156548 చెప్పిన మాటలు అక్షర సత్యాలని అభ్యుదయవాది బోర సుభాషన్న తెలిపారు.

ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు వ్యవసాయ కూలీల పనులకు వెళుతున్నారని,డిగ్రీలు,పీజీలు,పి హెచ్ డి లు చేసిన విద్యావంతులు సరైన ఉపాధి,అవకాశాలు లేక రోజువారీ కూలీ,చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగాలు, సెక్యూరిటీ గార్డులు,వాచ్మెన్ పనులు చేస్తుండడం బాధాకరమని బహుజన నేస్తం బోర సుభాషన్న పేర్కొన్నారు.ఆర్థిక సమస్యలు,అప్పుల బాధల కారణంగా స్కీల్డ్ పోస్టులు వెతుక్కునే అవకాశం కూడా నిరుద్యోగులకు,యువతకు లేకుండా పోతుందని ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ చనగాని దయాకర్ గౌడ్ 9949284778 బాధపడుతున్నారని బోర సుభాషన్న తెలిపారు.కరోనా కాలంలో పేద,మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా తగ్గిందని,కుటుంబంలో ఎవరో ఒకరు ఉద్యోగం పోగొట్టుకోవడమో,ఉపాధి తగ్గడమో, కోవిడ్ వల్ల అప్పుల పాలు అవడమో,ఎక్కడికి వెళ్లలేక ఉన్నదంతా అమ్మేసి,దగ్గరున్న పట్టణాలకు పనుల కోసం వలస వెళ్లడమో,పిల్లల చదువుల కోసం,ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం దాచి పెట్టింది వాడేసి,ఆర్థికంగా చితికి పోవడం జరిగిందని సుభాషన్న తెలిపారు.20-25 ఏళ్ల మగ పిల్లలు కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలకు వెళితే, ఆడపిల్లలు ఇండ్లలో పని మనుషులుగా,కూరగాయలు అమ్మే వారుగా మారిపోయారని బోర సుభాషన్న తెలిపారు.షెడ్యూల్ కులాలపై కోవిడ్ ప్రభావం మరింత ఎక్కువగా ఉందని ఎమ్మార్పీఎస్ దళపతి మంద కృష్ణ మాదిగ 9440723808 చెబుతున్న మాటలను బట్టి లాక్ డౌన్ కు ముందు 39 శాతం మంది ఉపాధి ఉద్యోగంలో ఉండగా అది ఇప్పుడు 68 శాతానికి పెరిగిందని,ఇదే స్థాయిలో అణగారిన కులాల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని మాల మహానాడు నేత అద్దంకి దయాకర్ 9391133779 ఆవేదనను బోరన్న సర్వే రిపోర్టులో వివరించారు.స్త్రీ-పురుష అంతరం గణనీయంగా పెరిగిందని,కోవిడ్ కు ముందు 25 శాతంగా ఉన్న వివక్ష,నేడు 49 శాతానికి పెరిగిందని, తెలంగాణ ఆడబిడ్డల సంగం మహిళ జేఏసీ నేత వనితక్క 9397979427 మాటలను పేర్కొంటూ సమాన పనికి సమాన వేతనం ఎక్కడ అమలు కావడం లేదని బోర సుభాషన్న ఆరోపించారు.

సమాజంలో యువత మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతిందని కోవిడ్ తర్వాత 22 శాతం మంది డిప్రెషన్ లక్షణాలతో కనిపిస్తున్నారని ఎంఎల్ పార్టీ కార్యదర్శి బుద్ధ సత్యనారాయణ 8497954644 సూర్యాపేటలో చెప్పిన విషయాన్ని బోరన్న గుర్తు చేశారు.తెలంగాణ ఆంధ్రాలో 2021 నాటికి పేదరికం స్థాయి గణనీయంగా పెరిగిందని,కష్టాల్లో ఉన్న కుటుంబాలు, నిరాశ్రయులైన పేదలు కోవిడ్ కు ముందు 26 శాతం ఉంటే,నేడు 68 శాతానికి పెరిగిందని,కోవిడ్ తగ్గినా నేటికీ 72% కుటుంబాలను ఆర్థిక సమస్యలు పెనుభూతంలా వెంటాడుతున్నాయని వేల్పుల లింగన్న యాదవ్ 9848806382 బాధాకర మాటలే ఇందుకు సాక్షాలని కార్మిక,కర్షక పోరాటాల విప్లవ నేతాజీ బోరన్న తెలిపారు.

కోవిడ్ సమయంలో డిజిటల్ విద్య అందడం లోనూ తారతమ్యాలు కనిపించాయని, ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం లేని యంగర్ గ్రూప్ యువతలో ప్రతి నలుగురులో ఒకరు చదువులను విడిచి పెట్టారని బీసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ 9866699155 బాధను పాలకవర్గాలకు బోరన్న వివరించారు.కోవిడ్ ప్రమాద ఘంటికలు పేద వర్గాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయని,ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరిగాయనే ప్రచారాలు ప్రజలను భ్రమపెడుతున్నాయని,కోవిడ్ దెబ్బకు చదువుకునే అవకాశాలు సన్నగిల్లి,ఆర్థికభారంతోనే కుటుంబపోషణ కోసం ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిన దుస్థితి యువతను వెంటాడుతోందని బోర సుభాషన్న తీవ్రంగా బాధ పడ్డారు.

ఉపాధి రంగంలోకి వెళ్లడంకాదు,ఉన్నత చదువులకు యువత దూరమయ్యారని,కరోనా కాటేసిన బ్రతుకులకు తగిన చేయూత నివ్వాలని బోరన్న కోరారు.విద్యకు దూరమైన వారందరినీ తిరిగి విద్యాలయాల్లో చదువులు కొనసాగించుటకు సహాయపడాలని,పేద,మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక చేయూతనిచ్చే కార్యక్రమాలు చేపట్టాలని,విద్య, వైద్య రంగాలను ప్రైవేటు వర్గాలనుండి పూర్తిగా స్వాధీనం చేసుకుని,కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలోనే కొనసాగించాలని సిపిఐ (ఎంఎల్) కార్యదర్శి బోర సుభాషన్న డిమాండ్ చేశారు.

కోవిడ్ వాస్తవ వ్యధా చిత్రాన్ని పాలకులు మనసుపెట్టి వినాలని కార్పొరేట్ ధనస్వాముల సేవలో కాదు,దేశ ప్రజల సంక్షేమానికి శ్రీకారం చుట్టాలని,బ్రతుకు భారమై,చదువు దూరమై, కరోనా పంజాకు బలైన బహుజనులకు అండగా నిలవాలని కమ్యూనిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ పాలకవర్గాలకు రాసిన బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు.కాశ్మీర్ ఫైల్స్ కాదు,కరోనా ఫైల్స్ చూస్తే దేశ ముఖచిత్రం అర్థమవుతుందని,అమెరికా వెళ్లాల్సిన విద్యావంతుడు అడ్డమీద కూలిగా మారిన దైన్యం, ఇల్లు,ఒళ్ళు,గుల్ల అయిన కోట్లాదిమంది పేదలు కోవిడ్ దుర్మార్గానికి అప్పుల బాధతో అలమటిస్తున్న విషయాలను ప్రధానమంత్రి నుండి మొదలు సమస్త ప్రజాప్రతినిధులందరూ కోవిడ్ వ్యాధా చిత్రాన్ని చూడాలని బోరన్న హితవు పలికారు.

దేశమంటే మట్టి కాదని,మనుషులనే సంగతిని గుర్తించాలని,అంబానీ, ఆదానీలనే కాదు,కార్పొరేట్ దొంగలను విడిచి, నిజమైన ప్రజా క్షేత్రాన్ని సందర్శించాలని,సమస్యలను పరిష్కరించాలని,సమాజ సంక్షేమానికి పాటుపడాలని బోర సుభాషన్న ప్రభుత్వాన్ని కోరారు.కడుపు మాడిన నిరుద్యోగులు,నిరసనలు తెలిపితే,బస్సులపై రాళ్లు వేస్తే,అది ప్రజల ఆస్తి అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెగ బాధ పడుతున్నారని,మరి లక్షలకోట్ల విలువైన ఎయిర్పోర్టులు,ఓడరేవులు,విశాఖ ఉక్కు, ఎల్ఐసి,బ్యాంకులు,లక్షల కోట్ల ప్రభుత్వరంగ సంస్థలను,భూములను పప్పు బెల్లంలా కారుచౌకగా అమ్ముతుంటే అవి ప్రజల సంపద అని గుర్తుకు రాకపోవడం దారుణమని బోర సుభాషన్న పేర్కొన్నారు.

ఇకనైనా మేధావులు ప్రజలను చైతన్యం చేయాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube