నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో నేడు,రేపు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది.రానున్న 24 గంటల్లో మరో అప్పపీడనం ఏర్పడనుందని,దీని ప్రభావంతో 25,26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇక ఈ నెల 25న ఖమ్మం, నల్లగొండ,సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో,26న సిరిసిల్ల,పెద్దపెల్లి, కరీంనగర్,ఖమ్మం, నల్లగొండ,సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ,వరంగల్, జనగాం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.