ధాన్యం కొనుగోలు విషయంలో అసత్య ప్రచారాలు నమ్మవద్దు: కలెక్టర్,ఎమ్మెల్యే

నల్లగొండ జిల్లా:ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, ధాన్యం కొనుగోలు విషయంలో ఎవ్వరూ కూడా అసత్య ప్రచారాలు నమ్మవద్దని, అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి,మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం మార్కెట్ యార్డ్ నందు నూతన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్, ఎమ్మేల్యే కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు నిబంధనలు ప్రకారం ధాన్యం తీసుకువచ్చి ప్రతీ రైతు మద్దతు ధర పొందవచ్చని, అలాగే సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తామని, ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17% మాశ్చరైజ్ ఉండే ధాన్యానికి

 Dont Believe False Propaganda Regarding Grain Purchase Collector Mla, False Pro-TeluguStop.com

రూ.2320ధరతో కలిపి రూ.500 బోనస్ కలిపి రూ.2830 ఇవ్వడం జరుగుతుందని,కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే సన్నధాన్యానికి బోనస్ లభిస్తుందన్నారు,రైస్ మిల్లులో విక్రయాలకు బోనస్ వర్తించదని స్పష్టం చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, ధాన్యం కొనుగులుపై సీఎం, మంత్రులు నిత్యం సమీక్ష చేస్తున్నారని,చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని,జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం 156 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

అవసరం అనుకుంటే మరికొన్ని కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube