నల్లగొండ జిల్లా: జిల్లాలోని నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం మూడో రోజు నుండి నేటి రాత్రి నుంచి స్వామి, అమ్మవార్ల కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.భక్తుల సౌకర్యార్థం అధికారులు చేసిన ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, తలంబ్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమర్పించనున్నారు.
స్వామి వారి కళ్యాణానికి రాష్ట్ర మంత్రి మంత్రి శ్రీధర్ బాబు,పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
కళ్యాణం తిలకించేందుకు కొండపై బారీ ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.స్వామి వారి కళ్యాణానికి తలంబ్రాలు సమర్పించే ప్రక్రియ తిలకించేందుకు భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.