నల్లగొండ జిల్లా: హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తక్షణమే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్డిమాండ్ చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు ఎలక్షన్లలో కేసీఆర్ దగ్గర 25 కోట్ల రూపాయలు తీసుకొని రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిండని ఈటల రాజేందర్ మాట్లాడడం అర్థరహితమని మండిపడ్డారు.
నిరంతరం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజా పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డిపై ఇలాంటి కామెంట్ చేయడం ఈటెల అవివేకానికి నిదర్శనమనిఎద్దేవా చేశారు.ఈటెల తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ముస్లిం పార్టీని బీ టీంగా మార్చుకొని దేశవ్యాప్తంగా వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టి బీహార్ ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది బీజేపీ అని,బీ టీం ఆలోచన బీజేపీకి ఉంటుందని అన్నారు.
నరేంద్ర మోడీ,మీరు ఇవ్వాల బి టీం రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నిఖార్సైన సెక్యులర్ పార్టీగా దేశ రాజకీయాలు చేస్తుందని,మీలాంటి వారికి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు.తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాసి నష్టపోయిన నిరుద్యోగులకు నష్టపరిహారంగా లక్ష రూపాయల ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సదస్సు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఈనెల 28న జరిగే సదస్సుకు నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపనిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్,మణికంఠ,మహిళ నాయకురాలు కోడి శ్రీజ, సుజాత,ముక్కుమల్ల శ్రీనివాస్,కత్తుల జయ చందన్,కొండ ప్రసాద్, మహేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.