దశాబ్దాల తరబడి భారత రాజకీయాల్లో అధికారం చలాయించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్( Cogress ) కి ఇప్పుడు గెలుపు జీవన్మరణ సమస్యగా మారింది .స్వీయతప్పిదాల తో కొంత వయసు ప్రభావంతో కీలక నేతలు మరణించడం వల్ల కొంత ,యువనాయకత్వాన్ని ప్రోత్సహించడంలో వెనుకబడటం ఇలా రకరకాల కారణాలతో భారత రాజకీయాల్లో కాంగ్రెస్ వెనుకబడిపోయింది అని చెప్పాలి.
ఒక రాజస్థాన్లో తప్ప బలమైన ఏ రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ అదికారం లో లేదు .ఇప్పటికైనా కాంగ్రెస్ పుంజుకొని రాజకీయాల్లో తన ఉనికిని నిలుపుకోవడానికి ఆ పార్టీకి ఉన్న ఆఖరి అవకాశం కర్ణాటక ఎన్నికలు అని ఇక్కడ బలంగా పుంజుకుంటే మరికొన్ని సంవత్సరాలు ముందుకు దూసుకు వెళ్లడానికి అవకాశం వచ్చినట్టు అవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

రాహుల్ గాంధీ( Rahul Gandhi ) రాజకీయ సామర్థ్యానికి కూడా ఈ ఎన్నికలు గీటు రాయిగా మారాయని తెలుస్తుంది.భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన రాహుల్ ప్రభావం రాజకీయాల్లో ఉంది అని నిరూపితం అవ్వాలంటే కర్ణాటకలో గెలవాలని,, అప్పుడే ఆయన సమర్థత మీద దేశ ప్రజలకు నమ్మకం వచ్చిందని నిరూపితమవుతుందంటూ రాజకీయ విశ్లేషణ లు వస్తున్నాయి.

ఇప్పటివరకు వచ్చిన సర్వే ఫలితాలు అన్నీ కర్ణాటకలో కాంగ్రెస్ దే ఆదిక్యమని తేల్చేశాయి అందుకే ఈ పార్టీలోకి అన్ని పార్టీల నుంచి వలసలు పోటెత్తుతున్నాయి .

మరి సర్వే అంచనాల నిజమై కర్ణాటక( karnataka )లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది కాంగ్రెస్కు అతిపెద్ద బూస్ట్ అవుతుందని, జాతీయస్థాయిలో మోడీని ఎదుర్కోవడానికి అవసరమైన మోరల్ బూస్టింగ్ కూడా దొరికినట్టు అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి.రాహుల్ గాంధీని రోడ్డు మీదకు తీసుకువచ్చి పదవి నుంచి అనర్హుడుగా చేసి బంగ్లా ను సైతం ఖాళీ చేయించిన నేపథ్యంలో ఆ సానుభూతి కూడా ఈసారి కీలకపాత్ర పోషిస్తుంది అని కాంగ్రెస్ శ్రేణులు నమ్ముతున్నాయి మరి వారి నమ్మకం ఎంత వరకు నిజమవుతుందో గ్రాండ్ ఓల్డ్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందో లేదో చూడాలి.