ఈ నెల 13 నుంచి ప్రయాణికుల కొరకు ప్రత్యేక బస్సులు

నల్లగొండ జిల్లా: బతుకమ్మ,దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్ ఆర్టీసీ( TS RTC ) పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది.ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సంస్థ ఎండీ సజ్జనర్‌ తెలిపారు.

 Special Buses For Passengers From 13th Of This Month Bathukamma , Ts Rtc , Dus-TeluguStop.com

హైదరాబాద్‌( Hyderabad )లోని బస్‌ భవన్‌లో సోమవారం పోలీసు,రవాణా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

దసరా( Dussehra )కు ఆయా శాఖలు సహకరించాలని కోరారు.

ఈ నెల 20 నుంచి 23 వరకు అధిక రద్దీ ఉండే అవకాశముండటంతో ఆమేరకు ప్రత్యేక బస్సుల్ని అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు.అదనంగా 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు.

హైదరాబాద్‌,సికింద్రాబాద్‌ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక,మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube