నల్లగొండ జిల్లా: మొహమ్మద్ (స) వేలాది తెగల్ని ఒకే గొడుగు కిందకు తెచ్చి, పగద్వేషాలతో రగిలిపోయే వారి మధ్య ప్రేమ అనురోగాలను నెలకొల్పి,వారి మధ్య అనురాగ బంధాన్ని నెలకొల్పి,మూఢనమ్మకాల అంధకారం నుంచి మత భావనను తొలగించి, ఆధ్యాత్మికతను క్రియాత్మక జీవితపు సుభిషాల క్షేత్రంలో రప్పించి గొప్ప సంస్కర్త అయ్యారని, ఇటువంటి మొహమ్మద్ (స) ప్రవక్త జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నల్లగొండ డిఎస్పీ శివరామ్ రెడ్డి అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ నందు మొహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఎన్నో ఏళ్లుగా గంగా జమున తహసీబ్ ఉందని,దానికి నిదర్శనం ఈ రోజు మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని కొనియాడారు.చాలా మంది యువకులు కుల, మతాలకు అతీతంగా పాల్గొని రక్తదానం చేయడం చాలా సంతోషదాయకమన్నారు.
భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశమని,కుల మతాలకు అతీతంగా సోదర భావంతో ప్రతి ఒక్కరు కలిసి ఉండాలని తెలియజేశారు.మిలాద్ కమిటీ గత పది సంవత్సరాలుగా ప్రవక్త జన్మదిన వేడుకల్లో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నల్లగొండలో నిరుపేద ప్రజలకు ఆదుకుంటూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతోమంది అత్యవసర సమయంలో ప్రాణదాతలుగా నిలుస్తున్నారని మిలాత్ కమిటీని అభినందించారు.
పట్టణ ప్రజలందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు.శాంతియుతమైన వాతావరణంలో పట్టణ ప్రజలు పండగ నిర్వహించుకోవాలని సూచించారు.
మిలాత్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త (స) జన్మదిన సందర్భంగా మిలాద్ ఉన్ నబి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అపర్ణ బ్లడ్ సెంటర్ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించామని,దాదాపు 150 మందికి పైగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారని తెలిపారు.ఇదే కాక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించామని,మిలాద్ ఉన్ నబి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని,నల్గొండ ప్రజలు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ పట్టణ వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్సై సురేష్,సిపిఎం సీనియర్ లీడర్ ఎస్.డి హాశం,బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ లీడర్ ఎస్ డి జాఫర్,మిలాద్ కమిటీ ప్రెసిడెంట్ ఎండి మసి ఉద్దీన్ అడ్వకేట్,మిలాద్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ హబీబ్ మొహమ్మద్, సెకరెటరీ ఎండి హబీబ్ ఉద్దీన్ (అబీద్),ఎండి అహ్మద్ ఫసియుద్దీన్ ట్రెజరర్,అహ్మద్ ఇమ్రాన్ జాయింట్ సెక్రెటరీ,షేక్ అహ్మద్,సమియుద్దిన్, రమేష్,జయబాబు, తబ్రేజ్,జునేత్,శ్రీకాంత్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు
.