- నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ,గట్టుప్పల్,మునుగోడు మండలాల్లో టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి హాజరైన్నారు.
ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు.ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని,దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని,దేశంలో తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లో కరెంట్ పోయిందని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ లకు ఓటేస్తే వృధాప్రయాస అని,బీజేపీకి ఓటేస్తే బావికాడికి మీటర్లు వస్తాయని చెప్పారు.బావికాడ మీటర్లు కావాలా?సంక్షేమ పథకాలు కావాలా? మీరే నిర్దారించుకోండని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం వివిధ పార్టీలకు చెందిన 200 మంది వరకు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.