నల్లగొండ జిల్లా:దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాలలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేంద్ర మంత్రి అసుప్రియ పటేల్ రాజ్యసభలో వెల్లడించారు.అయితే మధ్యం తాగే వారి శాతం తగ్గిందని మంత్రి తెలిపారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015-16లో ఏపీలో 35 శాతం,తెలంగాణలో 54 శాతం మంది మధ్యం సేవించేవారని పేర్కొంది.2019-21లో ఏపీలో 31 శాతం,తెలంగాణలో 50శాతానికి తగ్గిందని తెలిపింది.